Tuesday, April 30, 2024

తెలంగాణ, ఎపిలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకం జరిగింది. తెలంగాణ, ఎపిలతో సహా ఏడు రాష్ట్రాల హైకోర్టుల కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం ఉన్న సీజేలను సుప్రీంకోర్టు జడ్జిలుగా సిఫార్సు చేసింది.

దీంతో వీరి స్థానాల్లో కొత్త ప్రధాన నాయమూర్తులను నియామించారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్‌ ఆరాధే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ధీరజ్‌సింగ్ ఠాకూర్‌ లను నియమించాలని కొలీజియం సూచించింది. కాగా, 2022 జూన్ 28న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు.

Also Read: విండీస్ టి20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. తిలక్ వర్మకు చోటు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News