Sunday, April 28, 2024

డబుల్ స్పీడ్‌తో వస్తుంది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  కారు కేవలం సర్వీసింగ్‌కు వెళ్లిందని.. మళ్లీ రెట్టింపు వేగంతో దూసుకొస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ వాళ్లు తప్పుడు కేసులు పెడుతున్నారని, కార్యకర్తలు అధైర్యపడొద్దని, పార్టీ కా ర్యకర్తలకు లీగల్ సెల్ అండగా ఉంటుందని పేర్కొన్నా రు. బిఆర్‌ఎస్ పార్టీ మోడీకి, రేవంత్ రెడ్డికి భయపడే పా ర్టీ కాదని అన్నారు. ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణ ఏకైక గొంతుక బిఆర్‌ఎస్ అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో తెలంగాణ సమస్యల మీద పోరాడిన చరి త్ర బిఆర్‌ఎస్‌దేనని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఆ దివారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశానికి బిఆర్‌ఎస్ అగ్రనాయకులు హరీశ్ రావు, మాజీ మంత్రులు మల్లారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీనియర్ నాయకులు కే.కేశవరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బి ఆర్‌ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి కెటిఆర్ ప్రసంగించారు. ఢిల్లీలో తెలంగాణ గొంతుక వినబడాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బిఆర్‌ఎస్ గెలవాలని చెప్పారు. కాంగ్రెస్, బిజెపిలు కలిసి తెలంగాణ గొంతుక బిఆర్‌ఎస్‌ను ఖతం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు చూసి నా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యాసం చుసినా అదే విష యం రుజువు అవుతుందని చెప్పారు. ఇటీవల ప్రధాని మోడీని రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కలిసినపుడు ఆయన బిఆర్‌ఎస్‌ను ఫినిష్ చేసేందుకు పూర్తిగా సహకరిస్తాం అన్నారట అని, రాధాకృష్ణ రాశారని పేర్కొన్నా రు. బిఆర్‌ఎస్ పార్టీ బిజెపి టీం కాదని.. బిజెపి, కాంగ్రెస్‌లు ఒక్కటేనని స్పష్టంగా తెలియడం లేదా..? అని ప్రశ్నించారు. అదానీ, మోడీ ఒక్కటేనని ఢిల్లీలో విమర్శించే కాంగ్రెస్.. దావోస్‌లో అదే అదానీతో పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు.
అదానీకి అవకాశం ఇవ్వలేదు..
అదానీకి బిఆర్‌ఎస్ అవకాశమే ఇవ్వలేదని కెటిఆర్ పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ పట్ల మైనారిటీల్లో ఉన్న అపోహలను తొలగించాలని అన్నారు. మల్కాజిగిరిలో భారీ మెజారిటీ దిశగా కష్టపడదామని పిలుపునిచ్చారు.
కరెంట్ బిల్లులు సోనియాకే పంపుదాం
200 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులు కట్టొద్దని.. ఆ బిల్లులు సోనియాగాంధీనే కడుతుందని కాంగ్రెస్ నేతలు చెప్పారని.. కరెంటు బిల్లులు ఆమెకే పంపాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. సోనియాకు ప్రజలు బిల్లులు పంపేలా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, నేతలు ప్రజలను సమాయాత్తం చేయాలని సూచించారు.కాంగ్రెస్ తప్పించుకునే ప్రయ త్నం చేస్తుందని.. మనం ఇప్పటి నుంచే ఒత్తిడి చేయాలని అన్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని రేవంత్, గత నవంబర్ నుంచే కట్టొద్దని కోమటి రెడ్డి వెంకట రెడ్డి పిలుపునిచ్చారని గుర్తు చేశారు. తాను వారి మాటలనే గుర్తు చేశానన్నారు. తాను బిల్లులు కట్టొద్దంటే భట్టి తనది విధ్వంసకర మనస్తత్వం అని అంటున్నారని.. నిజాలు మాట్లాడితే విధ్వంసకర మనస్తత్వమా..? అని ప్రశ్నించారు.
తక్కువ ఓట్ల తేడాతో 14 సీట్లు కోల్పోయాం
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ కన్నా కేవలం నాలుగు లక్షల ఓట్లు ఎక్కువ సాధించిందని, బిఆర్‌ఎస్ కు ఇంకో 7, 8స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రం లో హంగ్ అసెంబ్లీ ఉండేదని చెప్పారు. తక్కువ ఓట్ల తేడాతో 14 సీట్లు కోల్పోయామన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానాన్ని అతి తక్కువ ఓట్లతో కోల్పోయామని తెలిపారు. కార్యకర్తలు కష్టపడి పని చేస్తే మల్కాజిగిరిలో ఈ సారి విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
అసెంబ్లీ సాక్షిగా భట్టి మాట తప్పారు..
నిరుద్యోగ భృతిపై డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా మాట తప్పారని కెటిఆర్ విమర్శించారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ తప్పించుకున్నట్టే పా లమూరు రంగారెడ్డికి జాతీయ హోదాపై మాట మార్చిందని అన్నారు. కాంగ్రెస్ హామీల నుంచి తప్పించుకుంటున్న తీరును ప్రజాకోర్టులోనే సాధికారికంగా ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సమాచార హక్కు చట్టాన్ని కూ డా కార్యకర్తలు సమర్థంగా వాడుకోవాలని సూచించారు. మనం పాలన మీదే దృష్టి పెట్టి యూట్యూబ్ ఛానెన్స్‌లో వచ్చిన అడ్డగోలు దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయామన్నారు. ప్రగతి భవన్‌లో విలాసవంతమైన సౌకర్యాలూ అంటూ దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు భట్టి అందులోనే ఉంటున్నారని.. విలాసాలే అందులో ఉంటే భట్టి ఈ పాటికే టాంటాం చేయకపోయేవారా…? అని ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లో రేషన్‌కార్డులు ఇచ్చామని, ఆ విషయం కార్యకర్తలకు కూడా తెలియలేదని పేర్కొన్నారు. పార్టీ కమిటీలు కూడా పూర్తిగా వేయకపోవడంతో నష్టం జరిగిందని.. ఇక ముందు ఆలా జరుగదని చెప్పారు. మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశం నిర్వహించుకుందామని, గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరుగవని కెటిఆర్ అన్నారు.
భవిష్యత్తు లేదని కుంగిపోవద్దు : హరీశ్‌రావు
బిఆర్‌ఎస్‌కు విజయాలతో పాటు అపజయాలు ఉన్నాయని ఆ పార్టీ అగ్రనాయకులు, మాజీమంత్రి హరీశ్‌రావు తెలిపారు. గత అపజయాలకు కెసిఆర్ కుంగిపోతే తెలంగాణ వచ్చేదా అని వ్యాఖ్యానించారు. 2009లో మనకు పది సీట్లే వచ్చాయని.. ఇక పని అయిపోయిందని కెసిఆర్ ఊరుకుంటే తెలంగాణ వచ్చేదా..? అని ప్రశ్నించారు. ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇది పరీక్షా సమయం అని, భవిష్యత్తు లే దని కార్యకర్తలు కుంగిపోవద్దని కార్యకర్తల్లో ధైర్యం నిం పారు. భవిష్యత్తులో మళ్ళీ వచ్చేది బిఆర్‌ఎస్సేనని విశ్వా సం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 420 హామీల్లో వాళ్ళు పావ లా వంతుకు మించి అమలు చేయలేరని హరీశ్‌రావు ఎద్దే వా చేశారు. మల్కాజిగిరిలో పోయినసారి రేవంత్ తక్కువ ఓట్లతో గెలిచారని గుర్తు చేశారు. గెలిచిన తర్వాత మల్కాజిగిరి నియోజకవర్గాన్ని రేవంత్ రెడ్డి ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదని.. ఒక్క పైసా నిధులు తీసుకురాలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఈ సారి మనం గెలిచి సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సీట్ల ను గెలిచామని.. ఇప్పుడు ఎంపి సీటు కూడా గెలవాలని అన్నారు. ఇది పరీక్షా సమయమని.. మనం పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని వ్యాఖ్యానించారు.
ఎన్నికల కోడ్ వచ్చేలోపే హామీలు నెరవేర్చాలి
కర్ణాటకలో ఐదు గ్యారంటీల హామీ ఇచ్చి కాంగ్రెస్ అభాసు పాలైందని హరీశ్‌రావు అన్నారు. అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉండబోతోందని సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్‌కు కర్ణాటక లాంటి పరిస్థితే ఉంటుందని జోస్యం చెప్పారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చేలోపే కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలి.. కానీ కోడ్‌ను బూచీ చూపి హామీల అమలును కాంగ్రెస్ వాయిదా చేయాలని చూస్తోందని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అబద్దాలు ప్రచారం చేసి గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలిచిందని ఆరోపించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బీజేపీ గెలుపు పాలపొంగు లాంటిదేనని అసెంబ్లీ ఎన్నికల్లో నగర ఓటర్లు నిరూపించారని స్పష్టం చేశారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కూడా అసెంబ్లీ ఎన్నికల కన్నా భిన్నంగా ఉంటాయని తెలిపారు. కీలకమైన పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని బిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు అధికారంలో కొనసాగి మళ్లీ అధికారంలోకి రావడం అరుదు అని అన్నారు. రాజస్థాన్‌లో, ఛత్తీస్‌ఘడ్‌లో ఐదేళ్లకే కాంగ్రెస్ అధికారం కోల్పోయిందని గుర్తు చేశారు. కొన్ని చిన్న చిన్న కారణాలతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఓడిపోయిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. కార్యకర్తల సూచనలు పరిగణనలోకి తీసుకుని పార్టీని బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీల డ్రామాలు ఎండగట్టి పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు కార్యకర్తలు ఇప్పటి నుంచే నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
బిఆర్‌ఎస్‌ను బొంద పెట్టే మొనగాడు ఇంకా పుట్టలేదు : కడియం శ్రీహరి
బిఆర్‌ఎస్‌ను వంద మీటర్ల లోతున బొంద పెడతామని సిఎం లండన్‌లో అన్నారని, బిఆర్‌ఎస్‌ను బొంద పెట్టే మొనగాడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. బిఆర్‌ఎస్‌ను బొంద పెట్టడం రేవంత్‌తో కాదు కదా ..రేవంత్ అయ్య నుంచి కూడా కాదని పేర్కొన్నారు. గుంపు మేస్త్రీ పేరుకు తగ్గట్టుగానే రేవంత్ వ్యవహార సరళి ఉందని విమర్శించారు. కెటిఆర్ దావోస్ వెళ్ళినపుడు ఎం త హుందాగా వ్యవహరించారో రేవంత్ ఎంత దరిద్రంగా వ్యవహరించారో ప్రజలు గమనించారని చెప్పారు. రేవం త్ గుంపు మేస్ట్రీ గొప్పతనం ఏమిటో తేలిపోయిందని పే ర్కొన్నారు. కాంగ్రెస్ మంత్రులు కోతుల గుంపులా ప్రవర్తిస్తున్నారని, పోటీ పడి గత ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ బిఆర్‌ఎస్‌దే విజయమని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News