Thursday, May 2, 2024

కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ షెడ్యూల్ ఖరారు..

- Advertisement -
- Advertisement -

ఆరంభ మ్యాచ్‌లో ఆసీస్‌తో భారత్ ఢీ
కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ షెడ్యూల్ ఖరారు

లండన్: కామన్వెల్త్ గేమ్స్‌కు సంబంధించిన క్రికెట్ షెడ్యూల్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరుగనున్నాయి. ఈ క్రీడల్లో తొలిసారి క్రికెట్‌కు చోటు కల్పించారు. అయితే ఈసారి గేమ్స్‌లో మహిళల విభాగంలో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. జులై 29 నుంచి ఆగస్టు 7వరకు క్రికెట్ పోటీలు జరుగుతాయి. ఆరంభ మ్యాచ్‌లో భారత్‌-ఆస్ట్రేలియా మహిళల జట్లు పోటీ పడుతాయి. టి20 ఫార్మాట్‌లో క్రికెట్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ క్రీడల్లో భారత్, ఆస్ట్రేలియాలతో పాటు పాకిస్థాన్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్ తదితర జట్లు పాల్గొంటున్నాయి. ఫైనల్ పోరు ఆగస్టు ఏడున జరుగుతుంది. విశ్వ వేదికపై క్రికెట్‌కు మరింత ప్రాచుర్యం దక్కుతుందనే ఉద్దేశంతో ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో దీనికి చోటు కల్పించారు. ఇక పలు అగ్రశ్రేణి జట్లు వీటిలోఆడేందుకు ముందుకు వచ్చాయి. దీంతో మహిళల విభాగంలో ఆసక్తికర పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఒక వేళ ఈసారి క్రికెట్ మంచి ఆదరణ లభిస్తే రానున్న రోజుల్లో పురుషుల విభాగంలో కూడా పోటీలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా, కామన్వెల్త్ క్రీడలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి జేఫ్ అలర్‌డైస్ వెల్లడించారు.

Commonwealth games Cricket schedule released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News