Thursday, May 2, 2024

31లోగా ఈ పనులు పూర్తి చేయండి

- Advertisement -
- Advertisement -

Complete these tasks within March 31

లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది

న్యూఢిల్లీ : ఆర్థిక సంవత్సరం చివరి రోజు మార్చి 31 లోగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆ తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేక ఆర్థిక పనులకు ఈ నెలాఖరే గడువు. 2022 మార్చి 31 లోగా పూర్తి చేయాల్సిన పనులేమిటో తెలుసుకుందాం.
ఐటిఆర్ ఫైలింగ్
2021-22 అసెస్‌మెంట్ సంవత్సరానికి గాను మీరు ఇంకా ఐటిఆర్(ఆదాయం పన్ను రిటర్న్) ఫైల్ చేయలేదా, దీనికి మార్చి 31 వరకు అవకాశం ఉంది. అలాగే సవరించిన ఐటిఆర్‌ను కూడా ఈ తేదీలోగా ఫైల్ చేయవచ్చు.
బ్యాంక్ ఖాతా కెవైసి అప్‌డేట్
ఇంతకుముందు బ్యాంక్ ఖాతా కెవైసిని అప్‌డేట్ చేయడానికి చివరి తేదీ 2021 మార్చి 31 వరకు ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) కెవైసిని అప్‌డేట్ చేయడానికి చివరి తేదీ 2022 మార్చి 31 వరకు పొడిగించింది.
పన్ను ఆదా పెట్టుబడులు
ఆదాయపు పన్నును నివారించడానికి పన్ను చెల్లింపుదారుడు పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ పెట్టుబడిని అంచనా సంవత్సరం ముగిసేలోపు చేయాలి. అందువల్ల మీరు కూడా పన్ను ఆదా పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మార్చి 31లోపే పూర్తి చేయండి.
ఆధార్-పాన్ లింక్
ఆధార్, పాన్ నంబర్‌ను లింక్ చేయడానికి చివరి తేదీ 2022 మార్చి 31 వరకు ఉంది. మీరు ఇప్పటికీ అనుసంధానం చేయనట్లయితే ఈ నెలాఖరు లోగా ఆధార్, పాన్ లింక్ చేసుకోండి. ఈ గడువు లోగా చేయకుంటే పాన్ నంబర్ చెల్లదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News