Saturday, April 27, 2024

జాతీయ స్థాయి మైన్స్ రెస్కూ పోటీల నిర్వహణపై సమావేశం 

- Advertisement -
- Advertisement -

యైటింక్లయిన్‌కాలనీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటి సారి నిర్వహిస్తున్న జాతీయ స్థాయి మైన్స్ రెస్కూ పోటీల విజయవంతంగా నిర్వహించడంపై మంగళవారం 8వ కాలనీలోని మైన్స్ రెస్కూస్టేషన్‌లో సన్నాహక సమావేశం జరిగింది. సమావేశంలో సేఫ్టీ (కార్పోరేట్) జిఎం గురువయ్య, ఆర్‌జి2 జిఎం అయిత మనోహర్, రెస్కూ జిఎం ఎస్ వెంకటేశ్వర్లు, రామగుండం రీజియన్ సేఫ్టీ జిఎం ఎస్ సాంబయ్య హజరై పలు విషయాలపై చర్చించారు.

ఇటీవల హైద్రాబాద్‌లో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలపై సమీక్ష చేశారు. అలాగే పోటీల నిర్వహణకు చేయవలసిన పనులను నిర్ణయించారు. నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు మైన్స్ రెస్కూస్టేషన్‌తో పాటు ఏరియాలోని 7 ఎల్‌ఇపి గనిలో పోటీలు జరుగుతాయి. పోటీల్లో కోలిండియా బొగ్గు కంపెనీలు, ఆతిధ్య సింగరేణి జట్లు, యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ లాంటి 10 కంపెనీలకు చెందిన 25 జట్లు పాల్గోనున్నాయి.

ఇట్టి పోటీలను యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున ఎలాంటి లోటు పాట్లు లేకుండా నిర్వహించాలని నిర్ణయించారు. పోటీలకు వచ్చే అతిధులకు, డిజిఎంఎస్ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో సివిల్ డిజిఎం ధనుంజయ, రెస్కూస్టేషన్ సూపరింటెండ్ మాధవరావ్, తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News