Sunday, April 28, 2024

ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ రాజకీయ పబ్బం: బూర నర్సయ్య గౌడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు ప్రాజెక్టుల పేరుతో రాజకీయ పబ్బం గడుపుతున్నాయని బిజెపి సీనియర్ నేత బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంకె బిందెలు ఖాళీ అయ్యి పెంక కుండలు ఉన్నాయని పేర్కొనడం హాస్యస్పదంగా ఉందన్నారు. సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రూ.13 వేల కోట్ల బడ్జెట్ తో మోడీ విశ్వకర్మ యోజన ప్రవేశపెట్టారని, ఎన్నికల కారణంగా అమలు కాస్త ఆలస్యమైందని తెలిపారు. అయినా ఇప్పటి వరకు రూ. 1.20 లక్షల మందిని విశ్వకర్మ యోజనలో చేర్పించామని, దీనికి సంబంధించి ఎంపిక చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేయాలని, కానీ ఇప్పటి వరకు చేయలేదని విమర్శించారు. కనీసం 4 వేల మందికి సంబంధించిన వివరాలు కూడా పరిశీలన చేయలేదన్నారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులను అదేశించి పరిశీలన చేయించాలని, ఇప్పటికే గ్రాంట్ కూడా బ్యాంకుల్లో డిపాజిట్ అయిందన్నారు.

పరిశీలన పూర్తి చేస్తే లబ్ధిదారులకు నిధులు అందుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తే ఎన్నికల కోడ్ పడే అవకాశం ఉందని, నల్లగొండలో ఎస్‌ఎల్ బిసి ప్రాజెక్టుకు రూ. 600 కోట్లు ఇవ్వడానికి గత పాలకులు చేతులు రాలేదన్నారు. ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ రాజకీయం చేస్తున్నాయని, పోటీ పడి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఎన్నో లింకులు కాంగ్రెస్ పెట్టిందన్నారు. కృష్ణా జల వివాదంపై బిజెపి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిందని, ప్రాంతీయ పార్టీలకు ఓటు వేసి శూన్యమన్నారు. ఆ పార్టీ గల్లీలో, ఢిల్లీలో లేదని, బిజెపి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం లంకె బిందెలు ఇవ్వడానికి సిద్దంగా ఉందని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News