Sunday, April 28, 2024

కాంగ్రెస్ సమరోత్సాహం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు హైదరాబాద్ నుంచే సమరశంఖా న్ని పూరించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని తుక్కుగూడలో ఏప్రిల్ మొదటి వారంలో జరగబోయే బహిరంగసభతోనే ప్రా రంభించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు సిఎం రేవంత్‌రెడ్డి మల్కాజి గిరి లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ నేతలతో ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలోనే వెల్లడించినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల కో సం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యా రెంటీల సెంటిమెంటు పార్టీకి బాగా కలిసివచ్చిందని, ఆరు గ్యా రెంటీలే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాయని, అదే విధంగా ఎఐసిసి దేశ ప్రజల కోసం రూ పొందించిన అయిదు ‘న్యాయ్’లను కూడా తుక్కుగూడ సభలోనే విడుదల చేయాలని, ఆ విధంగా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందనిముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన సూచనకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు కూడా ఆమోదముద్ర వేశారని, అందుకే ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడలో నిర్వహించబోయే బహిరంగ సభను సీఎంతోపాటు టిపిసిసి అగ్రనాయకులు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారని వివరించారు.

దేశానికి దిశ, దశను నిర్ణయించే అయిదు న్యాయ్‌లను ప్రాంతీయ భాష ల్లో కూడా విడుదల చేస్తామని, అందులో భాగంగానే తెలుగులో తయారు చేసిన అయిదు న్యాయ్‌లతో కూ డిన మ్యానిఫెస్టోను ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేస్తారని, ఇప్పటికే ఇంగ్లీషు, హిందీ భాషల్లో ని అయిదు న్యాయ్‌ల మ్యానిఫెస్టోను న్యూఢిల్లీలోనే మీడియా సమావేశాల్లో ప్రకటించార ని, అందుచేతనే ప్రాంతీయ భాషల్లోని మ్యానిఫోస్టో ను తెలుగుతో ప్రారంభించాలని నిర్ణయించారని వివరించారు. అందులో భాగంగా తుక్కుగూడలో నిర్వహించే బహిరంగ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ముఖ్యఅతిథిగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, కెసి వేణుగోపాల్ తదితర అగ్రనాయకులందరూ హైదరాబాద్‌కు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవాలని ఏఐసిసి టిపిసిసికి సూచనలు చేసింది. ఇందుకు పిసిసి చీఫ్, సిఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో కనీసం 12ఎంపి సీట్లను గెలవాలని కాంగ్రెస్ వ్యూహారచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వలసలను ప్రొత్సహిస్తున్నారు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపి క, ప్రచారంలోనూ కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టిపిసిసి సిద్ధం అవుతోంది. కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు కానుండటంతో పాటు పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను ఏఐసిసి హైదరాబాద్‌లో విడుదల చేసే అవకాశం ఉండడంతో టి.-కాంగ్రెస్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పకడ్బందీగా ఏర్పాట్లు చేసి సభను విజయవంతం చేయాలని టి.కాంగ్రెస్ నాయకులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. టి.కాంగ్రెస్ తయారు చేసిన ఆరు గ్యారెంటీలు రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురాగా అదే స్ఫూర్తితో అయిదు న్యాయ్‌లు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు.

ప్రజారంజకమైన పాలనను అందించడానికి, దేశప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానకి, దేశ ప్ర జల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఎఐసిసి రూపొందించిన అయిదు న్యాయ్‌ల ఆధారంగా 25 గ్యారెంటీలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చే యడమే కాకుండా ప్రతి ఓటర్‌కు, ప్రతి ఇంటికీ తీసుకెళ్ళాలని, “గడపగడపకూ కాంగ్రెస్ మ్యానిఫెస్టో” చేరాలనే లక్షాన్ని నిర్దేశించుకోవడమే కాకుండా ఆ విధంగా దేశంలోని కాంగ్రెస్ కేడర్‌కు నిర్ధిష్టమైన కా ర్యాచరణను కూడా కేటాయించే కార్యక్రమం కూడా తుక్కుగూభా వేదికగా జరగబోతోందని వివరించా రు. అంతేగాక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోతున్నామనే భయంతోనే కాంగ్రెస్ పార్టీకున్న ఆర్ధిక మూలాలను దెబ్బతీసి ఎన్నికల్లో కనీస అవసరాలకు కూడా నిధులు లేకుం డా చేసేందుకే పార్టీకి చెందిన బ్యాంక్ ఎక్కౌంట్లను కూడా సీజ్ చేసిందని, ఈ ఎక్కౌంట్ల సీజ్‌తోనే బిజెపి ఓటమి పాలయ్యిందనటానికి నిలువెత్తు నిదర్శనమనే ఒక మెసేజ్‌ను దేశ ప్రజలకు, కాంగ్రెస్ కేడర్‌కు పం పించాలని కూడా పార్టీ అగ్రనాయకత్వం కృతనిశ్చయంతో ఉందని వివరించారు. 2014కు ముందు కాంగ్రెస్ పార్టీ పాలనలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని అప్పటి కేంద్ర ప్రభుత్వ పాలన ఎంతటి సుస్థిరంగా ఉందో, నిత్యావసర వస్తువుల ధర లు పేదవారికి సైతం అందుబాటులో ఉన్న విషయా న్ని పెట్రోల్ లీటర్ 65 రూపాయలుండగా నేడు అదికాస్తా 110 రూపాయలకు పెరిగిన వైనం, వంట గ్యా స్ సిలిండర్ ధర 480 రూపాయలుండగా ఇప్పుడు 1180 రూపాయల పెరిగి ఇప్పు డు 900 రూపాయలకు చేరుకొన్న వైనాన్ని కూడా మ్యానిఫెస్టోలో పొందుపరిచామని వివరించారు. పదేళ్ళ బిజెపి పాలనలో దేశ ప్రజలు పడరానిపాట్లు పడ్డారని,దేశ ప్రజ లు కూడా ఓట్లేసే సమయం కోసం ఎదురుచూస్తున్నారని, ఈపాటికే దేశ ప్రజలు బిజెపిని ఘోరంగా ఓడించడానికి కంకణబద్దులై ఉన్నారని అన్నారు. అంతేగాక ఇంటెలిజెన్స్ (ఐబి)వర్గాల నుంచి నివేదికలు తెప్పించుకొన్న బిజెపి అగ్రనేతలు తమకు ఓటమి తప్పదన్న అభిప్రాయానికి వచ్చారని, అందుకే ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశ్యంతోనే అక్రమంగా కేసులు పెట్టడం, సిబిఐ, ఇన్‌కంట్యాక్స్ (ఐటి), ఈడీ విభాగాలతో దాడులు చే యించి అక్రమంగా కేసులు పెట్టడం, బ్యాంకు ఎ క్కౌంట్లను సీజ్ చేయడం వంటి చర్యలకు పాల్పడు తూ అంతులేని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఈ అంశాలన్నింటినీ దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఆ నాయకులు వివరించారు. అం దుకే దేశ ప్రజలు పోలింగ్ తేదీల కోసం ఎదురు చూ స్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News