Sunday, April 28, 2024

వందేళ్లకైనా కాంగ్రెస్ రాదు

- Advertisement -
- Advertisement -

Congress Leader Of Tukde-Tukde Gang:Modi

తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో తిరిగి కోలుకోని స్థితిలో పార్టీ

మరో వంద సంవత్సరాలకైనా
అధికారంలోకి రాకూడదని కాంగ్రెస్
తనంతట తానే నిర్ణయించుకున్నట్టు
కనిపిస్తున్నది : పార్లమెంటులో మోడీ

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చకు ప్రధాని మోడీ సమాధానం ఇస్తూ అడ్డూఆపూ లేకుండా కాంగ్రెస్‌పై విరుచుకు పడ్డారు. బహుళ సంస్కృతులు, వైవిధ్యం కలిగిన దేశంలో విభజించు, పాలించు అనే బ్రిటిష్ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ అనుసరిస్తోందని కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు. ఫెడరలిజాన్ని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు సమాధానమిస్తూ జవహర్‌లాల్ నెహ్రూ మాటలతో తిప్పికొట్టారు. కాంగ్రెస్‌ది విభజించే మనస్తత్వం అని ధ్వజమెత్తారు. అంగ్రేజ్ ఛలేగయే ( బ్రిటిష్ వారు వెళ్లిపోయారు),అయినా విభజించు, పాలించు అన్నది మాత్రం మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు.. అందువల్ల కాంగ్రెస్ “ తుక్డే, తుక్డే గ్యాంగ్ ” కు నాయకత్వంగా ఎదిగిందని విమర్శించారు. (బిజెపి పదేపదే ఈ తుక్డె, తుక్డే గ్యాంగ్ అనే పదాన్ని ఒకవర్గం ఆందోళనకారులకు, జెఎన్‌టియు విద్యార్ధులకు కూడా వినియోగించడం పరిపాటి అయింది. ) జవహర్‌లాల్ పుస్తకం డిస్కవరీ ఆఫ్ ఇండియాను ప్రస్తావిస్తూ బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తమిళ, ఆంధ్ర, అస్సామీలు, కన్నడ, మళయాలీ, సింధి, పంజాబీ, హిందుస్థానీ …. వీరంతా వందల ఏళ్లుగా తమ స్వయం గుర్తింపును కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.

వివిధ రాష్ట్రాల్లోని సాంస్కృతిక తేడాలను ఉదహరిస్తూ రాహుల్ గాంధీ మా నాయనమ్మ ( మాజీ ప్రధాని ఇందిర)32 తుపాకీ గుళ్లకు బలయ్యారని, నా తండ్రి (మాజీ ప్రధాని రాజీవ్) పేలుడులో తునాతునకలయ్యారని ఉదహరించారు. మీరు ప్రమాదంతో ఆడుకుంటున్నారని, ఇది ఆపకపోతే మీరు సమస్యలు సృష్టిస్తారని రాహుల్ చేసిన వ్యాఖ్యలకు మోడీ సమాధానమిస్తూ దేశం నిబంధనల ప్రకారం కానీ ప్రభుత్వం వల్ల కానీ ఏర్పడింది కాదని, అది మనకు ఆత్మ వంటిదని, వెయ్యేళ్లుగా ప్రజలు దానితో అనుసంధానమై ఉన్నారని ప్రధాని మోడీ సోమవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా విష్ణుపురాణం పాఠాన్ని ఉదహరించారు. దేశం మొత్తం మీద కరోనా వ్యాప్తి చెందడానికి విపక్షమే కారణమని, సానుకూలంగా ఏదీ చేయలేదని,కొవిడ్ జాగ్రత్తలు ప్రజలకు చెప్పడం కానీ, పాటించేలా చేయడం కానీ ఏదీ చేయలేదని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆరోపించారు. కరోనా పాపం కాంగ్రెస్‌దేనని, ఆ పార్టీ వందేళ్ల వరకు అధికారం లోకి రాలేదని ధ్వజమెత్తారు. కరోనా తొలి విడతలో వలస కార్మికులను భయాందోళనలకు గురిచేసి వారు తమ గ్రామాలకు వెళ్లి కరోనాను వ్యాపించేలా కాంగ్రెస్ చేసిందని ఆరోపించారు.

మరోవైపు తమ ప్రభుత్వం కరోనా కట్టడి, నియంత్రణతోపాటు వ్యాక్సినేషన్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పుకొచ్చారు. దేశంలో కాంగ్రెస్ తన ప్రభావాన్ని కోల్పోతోందని, వందేళ్ల చరిత్ర ఉన్న ఆ పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిందన్నారు. 1998 నుంచి నాగాలాండ్, 24 ఏళ్లుగా ఒడిశాలో, చాలా ఏళ్లు గోవాలో, 1972 తరువాత బెంగాల్‌లో, 1962 తరువాత తమిళనాడులో, సుమారు పదేళ్లుగా తెలంగాణలో కాంగ్రెస్ తిరిగి అధికారం లోకి రాలేదన్నారు. పార్టీ అంశాల కోసం పార్లమెంటును వేదికగా చేసుకుంటున్నారని అందుకే తాను ఇలా స్పందించానని మోడీ కాంగ్రెస్‌ను ఉద్దేశించి అన్నారు. తన ప్రసంగానికి ముందు ప్రముఖ గాయని లతామంగేష్కర్ కు మోడీ నివాళి అర్పించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News