Saturday, April 27, 2024

ప్రచారంలోకి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌ఘడ్ కాంగ్రెస్ నాయకులు …

- Advertisement -
- Advertisement -

స్టార్ క్యాంపెయిన్‌లతో కాంగ్రెస్ జోరుగా ప్రచారం
మొత్తం 200 పైచిలుకు వివిధ రాష్ట్రాల సీనియర్ నాయకులు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దింపింది. మరోవైపు పోల్ మేనేజ్‌మెంట్ నాయకులను సమన్వయం చేయడం అంతర్గత లోటుపాట్లను సరిదిద్దడం లాంటి వాటిపై ఏఐసిసి ప్రత్యేక దృష్టి పెట్టింది. చివరి క్షణంలో ఇబ్బందులు తలెత్తకుండా హస్తం అధిష్టానం వ్యూహాలకు పదును పెడుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఏఐసిసి యంత్రాంగం రాష్ట్రంలో మకాం వేస్తోంది. నియోజక వర్గాల వారీగా నాయకుల సమన్వయం, ఓటర్ల మనోగతం, పోల్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే కెసి వేణుగోపాల్ పోలింగ్ నిర్వహణ, ఇతర అంశాలపై వార్ రూమ్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన 150 మంది నాయకులు రంగంలోకి…
దీంతోపాటు కాంగ్రెస్ అభ్యర్ధులకు మద్ధతుగా స్టార్ క్యాంపెయినర్లు ప్రచార వేడిని పెంచారు. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు చెందిన 150 మందికి పైగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో అభ్యర్థులకు మద్ధతుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. మరో వంద మంది వార్‌రూమ్ నిర్వహిస్తున్నారు. జైరాం రమేష్ సీనియర్ నాయకులు వాళ్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే 70కి పైగా నియోజకవర్గాలను పార్టీ అగ్రనేతలు చుట్టేశారు. నిర్ధేశించిన 80కిపైగా నియోజకవర్గాల్లో మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిలు ఎన్నికల ప్రచారం పూర్తి చేశారు. మిగిలిన 39 స్థానాలకు సంబంధించిన ప్రచార ప్రణాళికలను పిసిసి రూపొందిస్తోంది.
నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి
కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు ప్రియాంకగాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సీడబ్యూసీ సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్‌లతో పాటు నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో అగ్రనాయకులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News