Sunday, June 16, 2024

ప్రజలను మోసం చేయడంలో కెసిఆర్ పట్టభద్రుడుః కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

ప్రజలను మోసం చేయడంలో కెసిఆర్ పట్టభద్రుడని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. గతంలో సన్న వడ్లు పండించాలని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ గురువారం తన ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేసింది. సన్న వడ్లు వేయండి, మార్కెట్‌లో మంచిగ ఉంటది అని కెసిఆర్ గతంలో చెప్పిన వీడియోను కూడా పోస్టు చేసింది. ‘యాది మర్షినవా…సన్న వడ్లు ఎయ్యమనేది నువ్వే, వాటికి బోనస్ ఇస్తే అడ్డుపడేది నువ్వే..? గిట్లయితే ఎట్ల దొరా !! ’అని కామెంట్ చేసింది. కెసిఆర్ గతంలో సన్న వడ్లు పండించాలని, రూ.100 బోనస్ కూడా ఇస్తామని చెప్పి మోసం చేశాడని,

నేడు రైతులను ప్రోత్సహించడానికి, ప్రజా ప్రభుత్వం సన్న ఒడ్ల సాగు పెంచేందుకు రూ.500 బోనస్ ఇస్తామంటే కెసిఆర్ కుటుంబానికి ఎక్కడలేని బాధ కలుగుతుందని కాంగ్రెస్ దుయ్యబట్టింది. రైతులను గోస పెట్టి, ప్రజాధనాన్ని కొల్లగొట్టి రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పులపాలు చేశారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. బిఆర్‌ఎస్ నాయకులు ఆర్ధిక దోపిడీకి పాల్పడి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను మభ్య పెట్టేందుకు కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావు సంక్రాంతి గంగిరెద్దుల్లా పోటీ పడుతున్నారని కాంగ్రెస్ తన ఎక్స్ ఖాతాలో విమర్శించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News