Tuesday, April 30, 2024

కర్నాటకలోనూ కాంగ్రెస్‌ మునిగిపోగలదు: బొమ్మై

- Advertisement -
- Advertisement -

Bommai

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనున్నాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నాలుగు రాష్ట్రాల్లో ఘనవిజయం సాధించింది. ‘కాంగ్రెస్ ప్రతి చోట మునిగిపోతోంది. కర్నాటకలోనూ మునిగిపోగలదు’ అని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 2023లో జరుగనున్నాయి. ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పర్‌ఫార్మెన్స్ పేలవంగా ఉంది. రాష్ట్ర స్థాయిలోను, కేంద్ర స్థాయిలోను కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకోజూస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘గుజరాత్‌లో కూడా మేము గెలుస్తాము. కర్నాటకలోనూ గెలుస్తాము’ అని ఆయన చెప్పుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News