Thursday, May 2, 2024

పీఛేముడ్

- Advertisement -
- Advertisement -

Consensus reached at level talks of Commanders of India and China

 

లడఖ్‌లో ఘర్షణ ప్రాంతాలనుంచి వెనక్కి తగ్గడానికి అంగీకారం
భారత్ ‌చైనా కమాండర్ల స్థాయి చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయం

న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణ అనంతరం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను చక్కదిద్దే దిశగా భారత్, చైనాలు అడుగులు వేస్తున్నాయి. తాజాగా ఇరు దేశాల మధ్య జరిగిన కోర్ కమాండర్ల స్థాయి చర్చలు సానుకూల వాతావరణంలో సాగాయని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. తూర్పు లడఖ్‌లోని అన్ని ఘర్షణ ప్రాంతాలనుంచి వెనక్కి తగ్గడానికి ఇరు పక్షాలు చర్చల్లో అంగీకరించినట్లు చెబుతున్నారు. ‘ మోల్డోలో సోమవారం సుమారు 10 గంటల పాటు చర్చలు జరిగాయి. మంచి సానుకూల, నిర్మాణాత్మక వాతావరణంలో ఇరు దేశాల అధికారులు చర్చలు జరిపారు. ఉద్రిక్త పరిస్థితులనుంచి సాధారణ పరిస్థితులు తీసుకు వచ్చేందుకు ఏకాభిప్రాయానికి వస్తున్నాం.

ఆ ప్రాంతంనుంచి వెనక్కి వెళ్లేందుకు ఇరు పక్షాలు దాదాపు అంగీకారానికి వచ్చాయి. తూర్పు లడఖ్‌లోని అన్ని ఘర్షణ ప్రాంతాలనుంచి ఇరువురు వెనక్కి వెళ్లే కార్యాచరణపై చర్చిస్తున్నాం. అనుకున్న పద్ధతులను ఇరువురూ తు.చ తప్పకుండా పాటించేలా సమన్యాయం చేసుకోవాలనే నిర్ణాయానికి వచ్చాం’ అని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఇరు పక్షాలు కూడా అపరిష్కృత సమస్యలపై సుహృద్భావ, లోతయిన చర్చలు జరిపాయని, పరిస్థితిని చల్లబర్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి అంగీకరించాయని బీజింగ్‌లో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి బీజింగ్‌లో చెప్పారు.

ఆ వార్తలు అబద్ధం

ఇదిలా ఉండగా తూర్పు లడఖ్‌లో జరిగిన ఘర్షణల్లో 40 మందికి పైగా చైనా సైనికులు మృతి చెందినట్లుగా వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ విలేఖరుల సమావేశంలో చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పకపోవడం గమనార్హం. ఈ నెల15న ఈ ఘర్షణలు చోటు చేసుకున్నప్పటినుంచి మీడియా సమావేశాల్లో ఈ ఘర్షణల్లో చైనా వైపునుంచి ప్రాణ నష్టానికి సంబంధించి విలేఖరులు అడిగిన అన్ని ప్రశ్నలకు లిజియాన్ సమాధానాలను దాట వేస్తూనే వస్తున్నారు. అయితే మనం 20 మంది జవాన్లను కోల్పోతే చైనా వైపు అతంకు రెట్టింపు నష్ట జరిగింది’ అని కేంద్ర మంత్రి వికె సింగ్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ వ్యాఖ్యలు చేశారు.

మరో వైపు వాస్తవాధీన రేఖ వెంబడి మే 2నాటి పరిస్థితులు నెలకొనాలని భారత్ డిమాండ్ చేస్తోంది. సోమవారం సాయంత్రం ఈ మేరకు చర్చలు జరగ్గా, మంగళ, బుధవారాల్లో కూడా చర్చలు కొనసాగనున్నాయి. గాల్వన్ లోయ ప్రాంతంలో ఈ నెల 15వ తేదీ ఇరు దేశాల బలగాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నప్పటినుంచి సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. చైనా వైపు ఇప్పటికే దాదాపు వెయ్యి మంది పిఎల్‌ఏ జవాన్లు మోహరించి ఉండగా, భారత్ సైతం దానికి దీటుగా అదనపు బలగాలను ఆ ప్రాంతానికి తరలించడం తెలిసిందే. సోమవారం నాటి చర్చల్లో భారత బృందానికి 14 కోర్ కమాండర్ లెఫ్టెనెంట్ .నరల్ హరిందర్ సింగ్ నేతృత్వం వహించగా, చైనా బృందానికి టిబెట్ మిలిటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ మేజర్ జనరల్ లియులిన్ నాయకత్వం వహించారు.

ఆర్మీ చీఫ్ లడఖ్ సందర్శన

ఇదిలా ఉండగా మంగళవారం లేహ్ చేరుకున్న సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఎంఎం నరవణె అక్కడి సైనికాధికారులతో వాస్తవ పరిస్థితులపై చర్చలు జరిపారు. రెండు రోజుల పర్యటన కోసం ఆర్మీ చీఫ్ లడఖ్ వచ్చారు. ఆయన లేహ్‌లోని సైనిక ఆస్పత్రిని సదర్శించి అక్కడ చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News