Thursday, May 2, 2024

లాటిన్ అమెరికాలో 15 లక్షలు దాటిన కరోనా మరణాలు

- Advertisement -
- Advertisement -

Corona deaths cross 15 million in Latin America

న్యూఢిల్లీ : లాటిన్ అమెరికాలో కరోనా మహమ్మారి ధాటికి 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 4 కోట్ల 50 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇందులో ఎక్కువగా బ్రెజిల్‌లో 6 లక్షల మంది మరణించారు. కరోనా మరణాల్లో అమెరికా తరువాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. అమెరికాలో ఇప్పటివరకు కరోనా వల్ల 7,32,476 మంది మృతి చెందారు. ఇక మెక్సికో, పెరు. కొలంబియా , అర్జెంటీనా దేశాల్లో అత్యధికంగా మరణాలు సంభవించాయి. ప్రపంచ వ్యాప్తంగా 23 కోట్ల 79 లక్షల ,69 వేల మంది 872 మంది కరోనా బారిన పడగా, 4 ,85, 327 మంది మృతి చెందారు. ఇందులో అమెరికాలో అత్యధిక కేసులు నమోదు కాగా, భారత్ రెండో స్థానంలో ఉంది. బ్రెజిల్, రష్యా, టర్కీ, ఫ్రాన్స్ తర్వాత స్థానాల్లో నిలిచాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News