Tuesday, April 30, 2024

మోర్తాజాకు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Corona Positive to Mashrafe Mortaza

 

ఢాకా : బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ మశ్రఫె మోర్తాజాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మోర్తజా కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అతనికి శనివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో మోర్తాజా ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. ఈ విషయాన్ని మోర్తాజా సోదరుడు మీడియాకు వెల్లడించాడు. ఇదిలావుండగా చాలా కాలం పాటు మోర్తాజా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా అతను పేరు తెచ్చుకున్నాడు.

కాగా క్రికెటర్‌గా కొనసాగుతున్న మోర్తాజా ఇటీవలే రాజకీయాల్లో ప్రవేశించాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పార్లమెంట్ సభ్యుడిగా మోర్తాజా కొనసాగుతున్నాడు. ఎంపిగా ఎంపికైన మోర్తాజా ఇంకా క్రికెట్‌కు వీడ్కోలు పలకలేదు. ఇదిలావుండగా మరో బంగ్లాదేశ్ క్రికెటర్ నఫీస్ ఇక్బాల్‌కు కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. అతను కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాడు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఐదుగురు క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. ఇందులో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా ఉన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News