Thursday, May 2, 2024

ఇస్రో బాహుబలి రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ షురూ

- Advertisement -
- Advertisement -

Countdown to ISRO Bahubali rocket launch begins

బెంగళూరు : మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సన్నద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈనెల 23న బాహుబలి రాకెట్ జీఎస్‌ఎల్వీ మార్క్ 3 (ఎల్వీఎం3)ను ప్రయోగించనున్నది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ శుక్రవారం అర్ధరాత్రి 12.07 గంటలకు ప్రారంభమైంది. అన్నీ సజావుగా సాగితే శనివారం అర్ధరాత్రి 12.07 గంటలకు ఈ రాకెట్ నింగి లోకి దూసుకెళ్లనుంది. ప్రైవేట్ శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీ వన్‌వెబ్‌కి చెందిన 36 బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్లను ఈ రాకెట్ ద్వారా రోదసీ లోకి పంపనున్నది. 5200 కిలోల బరువు కలిగిన ఈ 36 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష లోకి ప్రవేశ పెట్టనున్నది. రాకెట్ భూమి నుంచి ఎగిరిన తరువాత 16.21 గంటలకు 36 ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్ లోకి ప్రవేశ పెడుతుంది. ఉపగ్రహాలు కక్ష లోకి చేరిన తరువాత యూకే కి చెందిన గ్రౌండ్‌స్టేషన్ సిబ్బంది వాటిని తమ అధీనం లోకి తీసుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News