Monday, April 29, 2024

పిఎస్‌ఎల్‌వి సీ 56 ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలు

- Advertisement -
- Advertisement -

శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. పీఎస్‌ఎల్‌వి 56 ప్రయోగానికి శనివారం కౌంట్‌డౌన్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 6.30 గంటలకు ఈ ప్రయోగం చేపట్టనుంది. సింగపూర్‌కి చెందిన రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ డీఎస్‌ఎస్‌ఏఆర్‌తోపాటు మరో ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు.

సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలకు అవసరమైన ఉపగ్రహ ఛాయా చిత్రాలను ఇది అందించనుంది. ఇస్రో ఈ నెలలో చేపట్టనున్న రెండో ప్రయోగం ఇదే. చంద్రుడిపై పరిశోధనల కోసం ఈనెల 14 చంద్రయాన్ 3ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇంతకు ముందెన్నడూ ఎవరూ చేరని చంద్రుడి దక్షిణ భాగాన్ని చేరుకోవడమే లక్షంగా ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23 న సాయంత్రం ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News