Friday, May 3, 2024

కొరియర్ పేరుతో మోసం..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః కొరియర్‌లో డ్రగ్స్ వచ్చాయని చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేసిన నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్, టాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అమాయకుల నుంచి లక్షల రూపాయలు కాజేసిన నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… పార్శిల్ పంపుతున్నామని, అందులో విలువైన వస్తువులు ఉన్నాయని తార్నాకకు చెందిన ఓ మహిళకు నిందితుడు ఫోన్ చేశాడు. తర్వాత బాధితురాలికి నిందితుడు చెప్పిన పార్సిల్ కొరియర్‌లో వచ్చింది. ఆ తర్వాత మీకు వచ్చిన పార్శిల్‌లో చట్ట వ్యతిరేక వస్తువులు ఉన్నాయని నిందితుడు పోలీసుల పేరుతో ఫోన్ చేసి బాధితురాలిని బెదిరించాడు. పార్సిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని పోలీసులు కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ.6 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ తమ వద్ద ఉన్నాయని బెదిరించాడు.

ఆ మాటలతో భయపడిపోయిన సదరు మహిళ డబ్బులు నిందితుడు చెప్పి బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హర్షకుమార్‌గా గుర్తించారు. దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు హర్షకుమార్‌కు చైనా సైబర్ నేరగాళ్లతోనూ సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. క్రిప్టో కరెన్సీ మోసాల్లో హర్షకుమార్ చైనీయులకు సహకరిస్తున్నట్లు నిర్ధారించారు. ఇక్కడ క్రిప్టో కరెన్సీ పేరుతో పలువురు అమాయకుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి చైనాకు చెందిన నిందితులకు పంపిస్తున్నాట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఇన్స్‌స్పెక్టర్ హరిభూషన్ రావు, ఎస్సై సురేష్, హెచ్‌సి నర్సింగరావు, పిసిలు గోవింద్‌రావు, రవిశంకర్, వెంకటేష్ తదితరులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News