Monday, April 29, 2024

పేటిఎంలో ఎఐ సేవలు..వందలాది మంది ఉద్యోగులపై వేటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆన్‌లైన్ చెల్లింపుల యాప్ పేటిఎం వందలాది మంది ఉద్యోగులను తీసివేసింది. పేటిఎంలో చెల్లింపుల ప్రక్రియ ఇతర విధినిర్వహణకు ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున కృత్రిమ మేధ (ఎఐ)ను ప్రవేశపెట్టారు. దీనితో ఈ ప్రభావం మానవవనరుల సంబంధిత ఉద్యోగ శక్తిపై పడింది. ఎఐ ప్రక్రియతో తమ సంస్థకు అత్యంత అధునాతకత ఏర్పడుతుంది. పనులు చక్కగా సాగుతాయి. పైగా ఖర్చు కూడా ఆదా అవుతుంది. అందుకే ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించి పెద్ద ఎత్తున కృత్రిమ మేధను తీసుకువచ్చామని పేటిఎం మాతృసంస్థ ఒన్ 97 కమ్యూనికేషన్ తెలిపింది. సేల్స్, ఇంజనీరింగ్ వంటి రోజువారి కార్యకలాపాలకు చెందిన సిబ్బందిలో వందలాది మందిని తీసివేసినట్లు వివరించారు.

మునుపటితో పోలిస్తే ఇప్పుడు పనితీరు ఫలితాలు బాగా ఉన్నాయని తెలియచేసుకున్నారు. ఉద్యోగులకు అయ్యే జీతభత్యాల లెక్కలో చూస్తే తమకు ఇప్పుడు మొత్తం మీద పదిశాతం ఆదా అవుతోందని నిర్వాహకులు తెలిపారు. అయితే సాంకేతిక మార్పులను అనివార్యంగా వినియోగించుకోవల్సి రావడంతో ఎఐ వినియోగానికి దిగినట్లు పేటిఎం వ్యవస్థాపకులు, సిఇఒ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. వచ్చే కొద్ది సంవత్సరాలలో ఉద్యోగుల వనరులను మరో 15000 వరకూ పెంచే ఆలోచన ఉన్నట్లు వివరించారు. అవసరాన్ని బట్టి ఎఐ సాధనాసంపత్తిని పెంచుకోవడం, మానవ శక్తి వినియోగంలో హెచ్చుతగ్గులకు దిగడం సర్వసాధారణం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News