Friday, May 3, 2024

త్వరలో ఇంటి వద్దకే వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -

Covid second wave ends in Telangana:Dr Srinivasa rao

 

థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉంది
పాఠశాలల ప్రారంభంపై మా అభిప్రాయం ప్రభుత్వానికి తెలిపాం
త్వరలో ఇంటి వద్దకే వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ సెకండ్ వేవ్ ముగిసిందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు పేర్కొన్నారు. కరోనా సెకండ్‌వేవ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నిలువరించిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలలను తిరిగి ప్రారంభించడంపై జరిగిన సమావేశంలోనూ తమ అభిప్రాయాల్ని ప్రభుత్వానికి తెలిపానని చెప్పారు. కోఠిలోని ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి దాదాపు వాక్సినేషన్ పూర్తయిందని, ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటే ముందుకురావాలని కోరారు. థర్డ్ వేవ్ వస్తే ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఆసుపత్రులు, ఆక్సిజన్ సరఫరా సహా వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

అప్రమత్తంగా ఉండండి

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రభలుతున్నాయని డీహెచ్ శ్రీనివాస రావు ప్రకటించారు. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు వస్తున్నాయని, హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు బయటపడ్డాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,200 డెంగీ కేసులు వచ్చాయని… మొత్తంగా 13 జిల్లాల్లో మలేరియా, డెంగీ జ్వరాల కేసులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లు నడుస్తున్నాయని అన్నారు. ఇక నుంచి వారానికోరోజు డ్రై డేగా పాటించాలని డీహెచ్ పిలుపునిచ్చారు. ఎవరికైనా జ్వరం వస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ముందుగా పరీక్షలు చేయించుకోవాలని డీహెచ్ సూచించారు. పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా.. లార్వా పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డెంగీ దోమ పగటి వేళ కుడుతుందని, ఇళ్లలో దోమలు రాకుండా చూసుకోవాలని అన్నారు.

ఇంటి వద్దకే వ్యాక్సిన్

రాష్ట్రంలో ఆర్‌ఫ్యాక్టర్ 0.7 శాతం మాత్రమే ఉందని, పోస్ట్ కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన వారు ఎక్కువగా ఉన్నారని డిహెచ్ తెలిపారు. దీర్ఘకాల కొవిడ్ ఎఫెక్ట్ కారణంగా కారణంగా మనసిక సమస్యలు పెరుగుతున్నాయరి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.65 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. హైదరాబాద్ జిల్లాల్లో వాక్సినేషన్ వందశాతం పూర్తయిందని డీహెచ్ శ్రీనివాసరావు ప్రకటించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 90 శాతం వాక్సినేషన్ పూర్తయిందని, రాష్ట్ర వ్యాప్తంగా 56 శాతం మందికి ఒక డోస్ వాక్సినేషన్ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో వాక్సినేషన్ పెంచేందుకు ప్రత్యేకంగా ‘వ్యాక్సిన్ ఆన్‌వీల్స్‘ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలో ఇంటి వద్దకే వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.

అన్ని జ్వరాలు కొవిడ్ జ్వరాలు కాదు

రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని, అన్ని జ్వరాలు కొవిడ్ జ్వరాలు అనుకోవద్దని డిహెచ్ శ్రీనివాసరావు అన్నారు. సీజనల్ వ్యాధులు పెరగకుండా చర్యలు చేపట్టామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2025లోపు తెలంగాణ రాష్ట్రం మలేరియా రహిత రాష్ట్రంగా కాబోతుందని అన్నారు. ప్రజలు గూగుల్, యూట్యూబ్ వైద్యాన్ని నమ్మవద్దని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News