Thursday, May 2, 2024

కోవిడ్ నిబంధనలు పాటించాలి

- Advertisement -
- Advertisement -

CP Anand inspecting Hyderabad Police Commissionerate

సామాజిక దూరం పాటించాలి
కమిషనరేట్‌కు వచ్చే వారిపై ఆంక్షలు
కార్యాలయాన్ని తనిఖీ చేసిన నగర సిపి ఆనంద్

హైదరాబాద్ : కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది కోవిడ్ నిబంధనలు పాటించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. ఒమిక్రాన్ విస్కృతంగా వ్యాప్తి చెందుతుండడంతో నగర సిపి సివి ఆనందర్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని ఐదు అంతస్థులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి ఆనంద్ మాట్లాడుతూ గదుల్లో వెలుతురును పెంచాలని, సామాజిక దూరం పాటించాలని అన్నారు. సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. గుంపులుగా చేరి మధ్యాహ్నం భోజనం, టీ తాగవద్దని అన్నారు. వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కార్యాలయానికి వచ్చే సిబ్బందిని నియంత్రించనున్నట్లు తెలిపారు. వీలైనంత వరకు ఆన్‌లైన్ ద్వారానే పనిచేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలకు వెంటనే రంగులు వేయాలని ఆదేశించారు.

మరుగుదొడ్లు, వాష్‌రూమ్‌లను శుభ్రంగా ఉంచాలని సూచించారు. శానిటైజర్, మాస్కులు తదితర వాటిని కొనుగోలు చేసి సిబ్బందికి పంపిణీ చేసేందుకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. సోషల్ మీడియా వింగ్, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి, క్షేత్రస్థాయిలో వాస్తవంగా పనిచేస్తున్న సిసిటివిల సంఖ్య, సిపి కార్యాలయంలో పర్యవేక్షిస్తున్న వివిధ ఐటి ప్రాజెక్ట్‌ల స్థితిగతులపై ఆరా తీశారు. నగరంలో పనిచేస్తున్న 18,000మంది పోలీసుల సంక్షేమాన్ని, వివిధ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న మినిస్టీరియల్ సిబ్బందిని అభినందించారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో నగర అదనపు పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్, డిసిపి అడ్మిన్ సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News