Sunday, April 28, 2024

టి20 వరల్డ్ కప్: విరాట్‌పై వెల్లువెత్తున్న విమర్శలు..

- Advertisement -
- Advertisement -

దుబాయి: టి20 వరల్డ్‌కప్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలు కావడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శలు వెల్లువెత్తాయి. కోహ్లి తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే భారత్‌కు చేదు ఫలితాలు ఎదురయ్యాయని సోషల్ మీడియా వేదికగా అభిమానులు, మాజీ క్రికెటర్లు దుమ్మెత్తి పోస్తున్నారు. కీలకమైన మ్యాచుల్లో జట్టు కూర్పులో అనవసర మార్పులు చేయడం, టీమ్ ఎంపికలో ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వక పోవడం తదితర కారణాల వల్లే భారత్‌కు వరుస ఓటములు ఎదురయ్యాయని వారు విమర్శిస్తున్నారు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా కోహ్లి జట్టుకు అండగా నిలువలేక పోయాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతేగాక కోహ్లిలో ఆత్మవిశ్వాసం లోపించిందని, జట్టు సారథ్య బాధ్యతలు నిర్వహించే సత్తా అతనికి లేదని మరికొందరూ విమర్శించారు. ఇక హార్దిక్ పాండ్య జట్టుకు భారంగా మారాడని, అతన్ని ఎందుకు తుది జట్టుకు ఎంపిక చేస్తున్నారో కోహ్లికే తెలియాలని మరికొందరూ వ్యాఖ్యానిస్తున్నారు. పాకిస్థాన్, కివీస్, ఇంగ్లండ్‌లతో పాటు అఫ్గాన్ జట్ల కెప్టెన్‌లు పరిస్థితులకు తగినట్టు వ్యవహరిస్తూ ముందుకు సాగుతుంటే కోహ్లి మాత్రం టీమిండియాకు భారంగా మారాడని వారు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కెప్టెన్‌గా కోహ్లి ఏమాత్రం పనికి రాడని, అంతేగాక టీమిండియా దుస్థితికి ఐపిఎలే ప్రధాన కారణమని మరికొందరూ ఆరోపిస్తున్నారు. వరుస ఓటములతో భారత క్రికెట్ జట్టు కోట్లాది మంది క్రికెట్ అభిమానులను నిరాశ గురి చేసిందని, దీనికి ప్రధాన బాధ్యత కోహ్లినే వహించాల్సి ఉంటుందని మరి కొందరూ విమర్శించారు.

Cricket fans slams Kohli over India defeat by NZ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News