Friday, September 13, 2024

తిరుమలలో భక్తుల రద్దీ.. 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. 19 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్ లేని భక్తులకు దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 72.631 మంది భక్తులు దర్శించుకున్నారు.

38,529 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.85 కోట్లు వచ్చిందని దేవస్థానం అధికారులు వెల్లడించారు. వేసవి సెలవులు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News