Wednesday, December 4, 2024

పాండిచ్చేరి, తమిళనాడు వైపు దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాను

- Advertisement -
- Advertisement -

చెన్నై: బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాను తీవ్రమైంది. ఈ నేపథ్యంలో పాండిచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు మూసేశారు. ఫెంగల్ తుఫాను కారణంగా అతి భారీ వర్షం పడొచ్చని తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

భారత వాతావరణ శాఖ(ఐఎండి) తమిళనాడు,పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్ లలో విస్తృతంగా వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. తాజా సమాచారం ప్రకారం తీవ్ర అల్పపీడనంగా ప్రారంభమైన ఫెంగల్ తుఫాను రాబోయే 24 గంటల నుంచి 48 గంటల్లో పూర్తి స్థాయి తుఫానుగా మారనున్నదని అంచనా. నవంబర్ 30న కారైకాల్, మహాబలిపురం మధ్య తుఫాను నేలను తాకే ముందు శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర-వాయువ్య దిశగా కదులుతుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం నాగపట్నంకు ఆగ్నేయంగా 310 కి.మీ, పాండిచ్చేరికి ఆగ్నేయంగా 410 కి.మీ, చెన్నైకి దక్షిణ-ఆగ్నేయంగా 480 కి.మీ దూరంలో ఉన్న ఫెంగల్ తుఫాను నవంబర్ 28 సాయంత్రం లేదా నవంబర్ 29 తెల్లవారు జామున తుఫానుగా బలపడుతుందని అంచనా. గంటకు 65-75 నుంచి  85 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి, అయితే నిపుణులు తుఫాను భూమిని సమీపించే కొద్దీ కొద్దిగా బలహీనపడవచ్చని తెలిపారు. తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు , బలమైన గాలులతో లోతైన అల్పపీడనంగా ఇది తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News