Thursday, May 2, 2024

మోచా తుఫాను: పెరుగనున్న చెన్నై ఉష్ణోగ్రత స్థాయిలు

- Advertisement -
- Advertisement -
చెన్నై సహా దేశంలోని తూర్పు తీరంలో తుఫాను ప్రభావం అనేక రూపాల్లో ఉండనున్నది.

చెన్నై: బంగాళా ఖాతంలో తుఫాను రూపొందుతోందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) శనివారం ధృవీకరించింది. దాని ఫలితంగా సోమవారం అల్పపీడన ప్రాంతాన్ని సృష్టించడం వల్ల అల్పపీడనం ఏర్పడనున్నది. దేశం తూర్పు తీరంలో అనేక రూపాల్లో తుఫాను ఏర్పడే అవకాశం ఉంది. వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం తుఫాను సమయంలో చైన్నైలో ఉష్ణోగ్రత స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ఈ వారం చివరికల్లా చైన్నె నగరంలో వానలు కురిసే అవకాశం ఉంది.
తుఫాను కారణంగా, దేశంలోని తూర్పు ప్రాంతాలలో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఒడిశాలో భారీ వానలు కురిసే అవకాశం ఉంది.

ఒడిశాలోని బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రపాడ, కటక్, పూరితో సహా పలు జిల్లాలకు ఉరుములతో కూడిని వానలు పడొచ్చని ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మూడు తీర ప్రాంత జిల్లాలు దక్షిణ, ఉత్తర 24 పరగణాలు, పుర్బా మేదినీ పూర్‌లో కంట్రోల్ రూమ్‌లను తెరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News