Sunday, December 15, 2024

మందుబాబులకు అడ్డాగా మారిన అంగన్వాడీ కేంద్రం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం మందుబాబులకు అడ్డాగా మారింది. అంగన్వాడి కేంద్రంలో మందుబాబులు ప్రతీ రోజు మద్యం సేవిస్తున్నారు. అంగన్వాడి కేంద్రంలో మందుబాబులు విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ మద్యం సీసాలు పగలగొడుతున్నట్లు అంగన్వాడి టీచర్ నర్మదా తెలిపారు. తాము చదువుకునే చోట మద్యం సేవించవద్దని, బీరు సీసాలు పగులగొట్టవద్దని చిన్న పిల్లలు చేతులెత్తి మందుబాబులకు దండంపెడుతున్నారు. ఇప్పటికైనా దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ పెద్దలను కోరుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని  పిల్లల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త వాట్సప్ గ్రూప్ లలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News