Saturday, May 4, 2024

ఉక్రెయిన్ దాడుల్లో రష్యా చమురు డిపోలకు నష్టం

- Advertisement -
- Advertisement -

Damage to Russian oil depots in Ukraine attacks

ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో వెల్లడి

లెవివ్: ఉక్రెయిన్ జరిపిన క్షిపణి దాడుల్లో సరిహద్దులకు ఆనుకుని ఉన్న రష్యా ప్రాంతాల్లోని చమురు డిపోలు ధ్వంసమయినట్లు అసోసియేటెడ్ ప్రెస్( ఎపి) వార్తా సంస్థ విశ్లేషించిన శాటిలైట్ ఫోటోలను బట్టి తెలుస్తోంది. శనివారం నాటి ఈ ఫోటోల్లో బ్రియాన్స్ ప్రాంతంలోని రెండు చోట్ల చమురు డిపోలకు నష్ట వాటిల్లినట్లు కనిపిస్తోంది.ఈ పేలుళ్లలో ఒకటికన్నా ఎక్కువ సంఖ్యలో చమురు డిపోలు ధ్వంసం అయినట్లు, ఫలితంగా చెట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు ఈ ఫోటోల్లో ఉంది. ఈ పేలుళ్లు గత సోమవారం జరిగాయి. ఒక క్షిపణి రష్యా ప్రభుత్వ అధీనంలోని ట్రాన్స్‌నెఫ్ట్ కంపెనీ అనుబంధ సంస్థ అయిన ట్రాన్స్‌నెఫ్ట్ డ్రుజ్‌బాకు చెందిన చమురు డిపోను తాకింది. ఈ సంస్థ యూరప్‌కు ముడి ,మురును తీసుకెళ్లే డ్రుజ్‌బా పైప్‌లైన్‌ను నిర్వహిస్తుంది. దీనికి సమీపంలోనే మరో చమురు డిపోకూడా క్షిపణి దాడిలో దెబ్బతింది. ఉక్రెఇన్ సరిహద్దుకు వంద కిలోమీటర్లు ఉత్తరంగా బ్రియాన్స్ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News