Sunday, April 28, 2024

అంబేడ్కర్ ఆశయాలను కెసిఆర్ ముందుకు తీసుకెళ్తున్నారు: ప్రకాశ్ అంబేడ్కర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ శుభాకాంక్షలు తెలిపారు. అంబేడ్కర్ ఆదర్శాలు పాటించడమే నిజమైన నివాళి అన్నారు. సమాజంలో మార్చు తెచ్చేందుకు అంబేడ్కర్ భావజాలం అవసరమని ప్రకాశ్ తెలిపారు. సమాజంలో మార్చు కోసం సంఘర్షణ తప్పదన్నారు. రూపాయి సమస్యపై 1923లోనే అంబేడ్కర్ పరిశోధన పత్రం రాశారని చెప్పారు. ఆంగ్లేయులు భారత్ ను ఎలా దోచుకున్నారో గ్రహించారని వెల్లడించారు. ఆర్థిక దుర్భలత్వంపై పోరాడేందుకు కెసిఆర్ కృషిచేస్తున్నారు. దళితబంధు పథకం రూపొందించినందుకు కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు ప్రకాశ్ అంబేడ్కర్. అంబేద్కర్ ఆశయాలను కెసిఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన కొనియాడారు.

Also read: గోమూత్రం వద్దు.. గేదె మూత్రం బెటర్: ఐవిఆర్‌ఐ శాస్త్రవేత్తలు

అంటరానితనాన్ని పారద్రోలడానికి అంబేడ్కర్ కృషి చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కొన్ని అతిచిన్న కులాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసేవరకు సమస్య పరిష్కరించలేదన్నారు. తెలంగాణ కోసం కూడా ఎంతో పోరాటం జరిగింది. చిన్న రాష్ట్రాల ప్రతిపాదనకు అంబేడ్కర్ మద్దతిచ్చారని ఆయన పేర్కొన్నారు. రూపాయి బలోపేతం ఆవశ్యకతను అంబేడ్కర్ నొక్కి చెప్పారు. దేశానికి రక్షణ సమస్య వస్తే మరో రాజధాని అవసరమని అంబేడ్కర్ చెప్పారని ప్రకాశ్ పేర్కొన్నారు. రెండో రాజధానిగా హైదరాబాద్ సరైందని అంబేడ్కర్ చెప్పారని ఆయన గుర్తుచేశారు. పాక్, చైనా నుంచి హైదరాబాద్ ఎంతో దూరంలో ఉందన్నారు. రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్న ఆయన ఆశయం నెరవేరలేదని ప్రకాశ్ అంబేడ్కర్ స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News