Tuesday, April 30, 2024

డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపోటియన్‌లకు నోబెల్ మెడిసిన్ ప్రైజ్

- Advertisement -
- Advertisement -
Nobel prize for medicine

‘హీట్ అండ్ టచ్ వర్క్’కు గుర్తింపుగా…

స్టాక్‌హోం(స్వీడన్): ‘రిసెప్టర్స్ ఫర్ టెంపరేచర్ అండ్ టచ్’లను కనుగొన్నందుకుగాను అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపోటియన్‌  నోబెల్ మెడిసిన ప్రైజ్‌ను గెలుచుకున్నట్లు న్యాయనిర్ణేతలు ప్రకటించారు. వేడి, చలి, యాంత్రిక శక్తి ఎలా నరాల ఇంపల్స్‌లను ఇన్షియేట్ చేస్తాయన్న దానిపై వారు ప్రయోగం చేసి ఈ బహుమతి సాధించారు.

శాన్‌ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో జూలియస్ ప్రొఫెషర్‌గా పనిచేస్తున్నారు. కాగా కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ రీసెర్చ్ సంస్థలో పటాపోటియన్ పనిచేస్తున్నారు. వీరిద్దరూ తమ బహుమతి చెక్ 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్‌ను పంచుకోనున్నారు. గత ఏడాది హెపిటైటిస్ సి వైరస్‌ను కనుగొన్నందుకు ముగ్గురు వైరాలజిస్టులకు నోబెల్ మెడిసిన్ ప్రైజ్ లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News