Friday, March 29, 2024

భద్రాచలానికి హెలీకాఫ్టర్, అదనపు రక్షణ సామాగ్రి తరలింపు…

- Advertisement -
- Advertisement -

సిఎస్ సోమేశ్ కుమార్ కు సిఎం కెసిఆర్ ఆదేశాలు…

Defense equipment to Bhadrachalam on Helicopter

భద్రాద్రి కొత్తగూడెం: భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న ప్రకృతి విపత్తు నేపథ్యంలో ఇప్పటికే సిఎం కెసిఆర్ ఆదేశాలతో వరద ముంపు ప్రాంతాల్లో అన్ని రకాలుగా సహాయక, రక్షణ చర్యలు అధికారులు చేపట్టారు. సిఎం ఆదేశాల మేరకు స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో వుంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను రక్షించే సహాయక చర్యల్లో భాగస్వామ్యులవుతున్నారు.

వూహించని వరదలకు జలమయమవుతున్న లోతట్టు ప్రాంతాల్లో ప్రజా రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, రెస్క్యూ టీమ్ సభ్యులకు హెలీకాప్టర్లను అందుబాటులోకి తీసుకరావాలని సిఎం కెసిఆర్ ఇప్పటికే ఆదేశించారు. ఈ మేరకు అప్రమత్తంగా వుంటూ వరదల్లో చిక్కుకున్న వారిని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కాపాడాలన్నారు.

భధ్రాచలంలో క్రేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఖమ్మం జిల్లా స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ అభ్యర్థన మేరకు హెలికాప్టర్ ను అందుబాటులో ఉంచాలని సిఎం కెసిఆర్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ కు ఆదేశించారు. దీంతో పాటు వరదబాధితులను రక్షించేందుకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉపయోగపడే లైఫ్ జాకెట్లు, తదితర రక్షణ సామాగ్రితో పాటు అదనంగా మరిన్నింటిని తరలించాలని సిఎం ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News