Tuesday, May 7, 2024

సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని రెండు వారాలు పొడిగించిన ఢిల్లీ కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైయిజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మరి రెండు వారాలపాటు పొడిగించింది. ఈ కేసును ఈడి విచారిస్తోంది. రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జీ ఎం.కె. నాగ్‌పాల్ ధర్మాసనం ముందు ఈడి తన వాదన వినిపించింది. సిసోడియా తమ పాలసీకి ప్రజల ఆమోదం ఉందని తెలిపేలా కల్పిత ఈమెయిల్స్ పెట్టారని తెలిపింది. ఈడి తరఫు న్యాయవాది సిసోడియా బెయిల్ వినతిని వ్యతిరేకిస్తూ వాదనలు చేశారు. ఈడి తరఫు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ జోహెబ్ హుసైన్ వాదిస్తూ ఈడి తన కేస్ డైరీని చూయించాలనుకుంటోందని జడ్జీకి తెలిపారు. దానికి సిసోడియా తరఫు న్యాయవాది అది రహస్యంగా చూపెట్టకూడదన్నారు.

‘సీల్డు కవర్ వ్యవహారం కొనసాగని, ఒకవేళ నాకు వ్యతిరేకంగా ఏదైనా ఉపయోగించినట్లయితే, నా స్వేచ్ఛను నిరాకరిస్తున్నట్లయితే, వారు నా వెనుక ఏదో ఒకదానిని నమ్ముతున్నట్లయితే, అదేమిటో నాకు కూడా ఇవ్వాలి’ అని సిసోడియా న్యాయవాది తెలిపారు.

‘ అతనిపై దర్యాప్తు 60 రోజులు ఇంకా పూర్తి కాలేదు’ అని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. ‘60 రోజుల తర్వాత మేము సమర్పిస్తాం’ అని ఈడి తెలిపింది. ఇదిలావుండగా సిసోడియా బెయిల్ విచారణను కోర్టు మంగళవారానికి వాయిదావేసింది. దర్యాప్తు కీలక దశకు చేరిందని ఈడి కోర్టుకు తెలుపుకుంది. కాగా ఆప్ నాయకుడు సిసోడియా కస్టడీని ఏప్రిల్ 17వరకు కోర్టు పొడిగించింది. సిసోడియా ఏడాది కాలంలో 14 ఫోన్లను ధ్వంసం చేశారని, మార్చారని ఈడి పేర్కొంది. సిసోడియా మొదటి నుంచి తప్పించుకుంటూనే ఉన్నాడంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News