Monday, May 6, 2024

ఢిల్లీ లోని 9 పోలీస్ క్యాంటీన్లకు ఆహార నాణ్యత సర్టిఫికెట్

- Advertisement -
- Advertisement -

Delhi get Eat right campus tag from FSSAI

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ జిల్లా లోని మొత్తం 9 పోలీస్ క్యాంటీన్లకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఆహార నాణ్యతను ధ్రువీకరించే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ (ఫుడ్ సేఫ్టీ, అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా) సర్టిఫికెట్ లభించింది. దీనికి సంకేతంగా ‘ఈట్ రైట్ క్యాంపస్’ టాగ్ వచ్చింది. దేశ రాజధానిలో ఈ విధంగా అర్హత దక్కించుకున్న మొదటి పోలీస్ జిల్లాగా ఢిల్లీ జిల్లా గుర్తింపు పొందింది. ప్రజలు ఆరోగ్యభద్రత, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని పొందాలన్నదే దీని లక్షం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ జిల్లా లోని బికె రోడ్డు, కన్నాట్ ప్లేస్, తిలక్‌మార్గ్, మందిర్ మార్గ్ తదితర నాలుగు పోలీస్ క్యాంటీన్లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ కు చెందిన ఈట్ రైట్ క్యాంపస్ సర్టిఫికెట్ లభించింది. పోలీస్ యంత్రాంగానికి ఆహార వైవిధ్యం, జీవనశైలితో సంక్రమించే వ్యాధుల భారం తగ్గించడమే ఈ సర్టిఫికెట్ ఉద్దేశ్యం. ఇప్పుడు మిగతా పార్లమెంట్ స్ట్రీట్, చాణక్యపురి, తుగ్లక్ రోడ్, నార్త్ ఎవెన్యూ, అండ్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ ఫోర్స్ యూనిట్ తదితర పోలీస్ క్యాంటిన్లకు సర్టిఫికెట్ లభించింది. సాధారణంగా పోలీసులు సరైన సమయంలో సరైన ఆహారం పొందలేరని, ఈ సౌకర్యంతో ఆరోగ్యవంతమైన, ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు విరివిగా లభించే ఆహారం వారికి అందుతుందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమృత గుగులోథ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News