Friday, May 3, 2024

నిర్భయ హంతకులకు వారం రోజుల గడువు

- Advertisement -
- Advertisement -

Nirbhaya Convicts

 

న్యూఢిల్లీ: ఉరిశిక్షను వ్యతిరేకంగా తమకు న్యాయపరంగా దక్కే అవకాశాలను, క్షమాభిక్ష కోరే అవకాశాలతోసహా వివిధ ప్రత్యామ్నాయ అవకాశాలను వారం రోజుల్లోగా ఉపయోగించుకోవాలని నిర్భయ దోషులను ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆదేశించింది. వారం రోజుల గడువు అనంతరం ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు నిర్భయ నిందితులు నలుగురికి ఉరిశిక్షను అధికారులు అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1వ తేదీన నిర్భయ హంతకులకు ఉరిశిక్ష అమలు జరగాల్సి ఉండగా దీనిపై పాటియాలా కోర్టు గతంలో స్టే ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కుమార్ కైత్ బుధవారం తీర్పు ఇస్తూ న్యాయ అవకాశాలు కోల్పోయిన ఇద్దరు హంతకులను ఉరితీయాలన్న కేంద్రం వాదనను తోసిపుచ్చారు. నలుగురు హంతకులకు ఒకేసారి ఉరిశిక్ష అమలు జరగాల్సిందేనని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం లభించే చివరి శ్వాస వరకు జీవించే హక్కును ఈ నలుగురు దోషులు ఉపయోగించుకుంటున్నారని న్యాయమూర్తి చెప్పారు.

Delhi High Court grants one week time to Nirbhaya convicts 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News