Sunday, May 5, 2024

కేంద్ర ప్రభుత్వ ఢిల్లీ ఆర్డినెన్స్ రాజ్యాంగ ధర్మాసనానికి పెండింగ్‌తో జటిలమన్న ఆప్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ ఆప్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు గురువారం నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ ధర్మాసనం విచారణకు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలు , సేవల అధికారాన్ని ఆప్ ప్రభుత్వం నుంచి తప్పించి, తన పరిధిలోకి తీసుకుంటూ మే 19న కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఇది కేంద్రం, ఆప్ ప్రభుత్వాల మధ్య మరో తగవుకు దారితీసింది. ఢిల్లీ ప్రభుత్వ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం పరిశీలన జరిపి, ఇందులో పలు అంశాలు ఇమిడి ఉన్నందున పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు తెలిపారు. అయితే రాజ్యాంగ ధర్మాసనం ఆర్టికల్ 370 రద్దు విచారణలో ఉన్నందున సంబంధిత విస్తృత ధర్మాసనం ఈ విచారణ తరువాత ఆర్డినెన్స్ వ్యాజ్యంపై విచారణ జరుపుతుందని తెలిపారు.

అయితే రాజ్యాంగ ధర్మాసనం విచారణ అవసరం లేదని, ఇందుకు ఆలస్యం అవుతుందని, మొత్తం వ్యవస్థ దెబ్బతింటుందని , విచారణ వేగవంతం కావల్సి ఉందని ఆప్ చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సంబంధిత విషయంపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు అవుతుందని, అప్పుడు ఈ ధర్మాసనం ముందు ఇరు పక్షాలు అయిన ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తమ అప్పీలు దాఖలు చేసుకునేందుకు వీలుకల్పిస్తామని , ఈ మేరకు ఆదేశాలు ఇస్తున్నామని, బెంచ్ ఏర్పాటు అయ్యేలోగా ఇరు పక్షాలు అప్పీలుకు దిగాల్సి ఉంటుందని తెలిపారు. అంతకు ముందు పిటిషన్‌పై త్రిసభ్య ధర్మాసనం సంక్షిప్త విచారణ జరిపింది. ఇప్పటి ఆర్డినెన్స్‌తో కేంద్రం ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల సేవల వ్యవహారాలను తన అదుపులోకి తీసుకుందని స్పష్టం అయిందని పేర్కొంది. రాష్ట్రాల అధికారాల జాబితాలోకి వచ్చే పోలీసు, చట్టం, భూ వ్యవహారాలను ఢిల్లీ ప్రభుత్వం నుంచి తప్పిస్తూ రాజ్యాంగంలో ఉంది. వీటిని కేంద్రం సమర్థవంతంగానే తన పరిధిలోకి తెచ్చుకుంది.

కేంద్రం తీసుకువచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ ఆప్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు గురువారం నిర్ణయం తీసుకుంది. అయితే ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ పరిధిలోకి వచ్చే అధికారాలను కూడా ఈ క్రమంలో కేంద్రం తన కైవసం చేసుకుంటున్నట్లు ఆర్డినెన్స్‌లోని సెక్షన్ 3ఎ తెలియచేస్తోంది. రాష్ట్రాల పరిధిలోకి వచ్చే లిస్ట్ 2 జాబితాలోని ఎంట్రీ 41 (సేవలు) కూడా కేంద్రం పరిధిలోకి ఈ ఆర్డినెన్స్ ద్వారా వెళ్లినట్లు గుర్తించామని ధర్మాసనం పేర్కొంది. ఈ దశలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే హాజరయ్యాయరు. సంబంధిత వ్యాజ్యాలలో గతంలో వెలువడ్డ తీర్పులను ప్రస్తావించారు. కేంద్ర పాలిత ప్రాంత విషయానికి వచ్చేసరికి రాష్ట్రాల జాబితాలోకి వచ్చే అధికారాలు ఉమ్మడి జాబితాలోకి వస్తాయి కాబట్టి వీటిపై పార్లమెంట్ చట్టం చేసేందుకు అధికారం ఉందని తెలిపారు.
.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News