Tuesday, May 14, 2024

అమెరికాలో టోర్నడోల విధ్వంసం

- Advertisement -
- Advertisement -
Destruction of tornadoes in America
కెంటకీ రాష్ట్రంలో 100 మంది దాకా మృతి
ఇల్లినాయిస్‌లో అమెజాన్ గోడౌన్‌లో చిక్కుకున్న వంద మంది కార్మికులు
కాపాడేందుకు శ్రమిస్తున్న రెస్కూ టీమ్‌లు

వాషింగ్టన్: అమెరికాలో అత్యంత శక్తివంతమైన టోర్నడోలు(పెనుగాలులు) విధ్వంసం సృష్టించాయి. కెంటకీ రాష్ట్రంలో టోర్నడో సృష్టించిన బీభత్సానికి కనీసం 50 మందికి పైగా మృతి చెందినట్లు రాష్ట్ర గవర్నర్ ఆండీ బషీర్ చెప్పారు. రాష్ట్రంలో 300 కిలోమీటర్లకు పైగా పొడవున అనేక కౌంటీల్లో టోర్నడోలు విధ్వసం సృష్టించాయని ఆయన చెప్పారు.‘ ఈ ఘటనలో 50 మందికి పైగా మృతి చెంది ఉంటారని భావిస్తున్నాం. బహుశా ఈ సంఖ్య 70 100 మధ్య ఉండే అవకాశం ఉంది. కెంటకీ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన సుడిగాలి ఘటన ఇది’ అని ఆయన చెప్పారు.
గంటకు 200 కిలోమీటర్లకు పైగా వీచిన పెనుగాలుల తాకిడికి మే ఫీల్డ్ పట్టణంలో కొవ్వొత్తుల తయారీ ఫ్యాక్టరీలో పైకప్పు కూలిపోయిందని, ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించిందని ఆయన చెప్పారు. అర్ధరాత్రికి ముందే తాను అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు ఆయన తెలిపారు.

అమెజాన్ గోడౌన్‌లో చిక్కుకున్న 100 మంది!

అంతకు ముందు శుక్రవారం ఇల్లినాయిస్ రాష్ట్రంలోని అమెజాన్‌కు చెందిన భారీ గోడౌన్‌లో పెను తుపాను బీభత్సం సృష్టించిందని, గోడౌన్‌లో వందమందికి పైగా వర్కర్లు చిక్కుకు పోయారని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. క్రిస్మస్ సెలవులకు ముందు భారీ ఎత్తున వచ్చిన ఆర్డర్లను ప్రాసెస్ చేయడం కోసం వీరంతా నైట్‌షిప్ట్‌లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. గోడౌన్‌లో చిక్కుపడిన కార్మికులను కాపాడడానికి అధికారులు తెల్లవార్లూ శ్రమిస్తున్నారు. ఇక్కడి కాలిన్స్‌విల్లే ఎమర్జెన్సీ మేనేజిమెంట్ ఏజన్సీ దీన్ని భారీ ప్రమాద ఘటనలగా అభివర్ణించింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా, లేదా గాయపడ్డారా అనే విషయం స్పష్టం కాలేదు. ఇల్లినాయిస్ స్టేట్ పోలీసు, ఎమర్జెన్సీ మేనేజిమెంట్ ఏజన్సీ, స్థానిక అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారని, తాను కూడా పర్యవేక్షిస్తున్నాని రాష్ట్ర గవర్నర్ జె బి ప్రిట్జర్ తెలిపారు. మరోవైపు ఆర్కాన్సస్‌లో ఒకరు, టెన్నెసీలో ఇద్దరు ఇదే తరహా ఘటనల్లో మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News