Wednesday, October 9, 2024

 ‘దేవర’ నా బెస్ట్ మూవీ అంటున్నారు

- Advertisement -
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్, యువ సుధ ఆర్ట్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ “ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మూడేళ్ల కష్టమే దేవర సినిమా. నా కెరీర్‌లో బెస్ట్ మూవీ అని అందరూ అంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సుధాకర్‌కి థాంక్స్‌”అని అన్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ “ప్రేక్షకులు చూపిస్తోన్న ఆదరరాభిమానాలకు, ఇస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లకు ధన్యవాదాలు.

నందమూరి అభిమానులకు మెమెప్పుడూ రుణపడి ఉంటాం. ఈ సినిమా కోసం కష్టపడిన కొరటాల శివకి థాంక్స్‌”అని తెలిపారు. దిల్ రాజు మాట్లాడుతూ “ఈ సినిమాలో ఎన్టీఆర్‌ని రెండు గంటల నలబై నిమిషాలు ప్రేక్షకులు అలా చూస్తుండిపోయారు. సినిమాలో టెంపో అలా మెయిన్‌టేన్ అవుతూ వచ్చింది. బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా కలెక్షన్స్ వస్తున్నాయి”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాబు సిరిల్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News