Sunday, October 6, 2024

రూ. 2 లక్షల కోట్లు జిఎస్‌టి ఎగవేత

- Advertisement -
- Advertisement -

పన్నుల ఎగవేతలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా మోసాలు మాత్రం ఆగడం లేదు. కొందరు అక్రమార్కులు ఏదో ఒక రూపంలో ఎగవేతలకు పాల్పడుతూనే ఉన్నారు. ఒక్క 202324 ఆర్థిక సంవత్సరంలోనే 6084 కేసుల్లో రూ. 2.01 లక్షల కోట్ల మేరకు జిఎస్‌టి ఎగవేతలను గుర్తించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్‌టి ఇంటలిజెన్స్ (డిజిజిఐ) వెల్లడించింది. సేవల విభాగంలో ఆన్‌లైన్ గేమింగ్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బిఎఫ్‌ఎస్‌ఐ)తో పాటు ఇనుము, రాగి, తుక్కు వంటి ఖనిజాల విషయంల పన్ను ఎగవేతకు ఆస్కారం ఉంటున్నదని డిజిజిఐ వార్షిక నివేదికలో తెలియజేసింది. 202223 ఆర్థిక సంవత్సరం 4872 కేసుల్లో రూ. 1.01 లక్షల కోట్ల మేరకు ఎగవేతలను డిజిజిఐ గుర్తించగా, ఆ మొత్తం 202324 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.01 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం. ఇందులో రూ. 26605 కోట్ల స్వచ్ఛందంగా వసూలైనట్లు డిజిజిఐ తెలియజేసింది. 202223లో ఈ మొత్తం రూ. 20713 కోట్లుగా ఉంది.

మొత్తం ఎగవేతల్లో పూర్తిగా పన్నులు చెల్లించకపోవడానికి (అక్రమ మార్గంలో సరఫరా, తక్కువ విలువ చూపడం) సంబంధించిన కేసులు 46 శాతం కాగా, 20 శాతం నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు సంబంధించినవి ఉన్నాయని డిజిజిఐ తెలిపింది.ముఖ్యంగా ఆన్‌లైన్ గేమింగ్ రంగం నుంచే ఎక్కువ మొత్తంలో పన్ను ఎగవేతలు జరిగినట్లు డిజిజిఐ గుర్తించింది. 78 కేసుల్లో రూ. 81875 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు సంస్థ తెలిపింది. బిఎఫ్‌ఎస్‌ఐ రంగంలో 171 కేసుల్లో రూ. 18961 కోట్లు, కాంట్రాక్ట్ సర్వీసులకు సంబంధించి 343 కేసుల్లో రూ. 3846 కోట్లు, ఫార్మాకు సంబంధించి 22 కేసుల్లో రూ. 40 కోట్లు మేర పన్ను ఎగవేతలు గుర్తించామని సంస్థ తెలిపింది. ఇనుము, రాగి. తుక్కు, మిశ్ర ధాతువు వంటి ఖనిజాలకు సంబంధించి 1976 కేసుల్లో రూ. 16806 కోట్ల మేర ఎగవేతలు జరిగినట్లు సంస్థ తెలియజేసింది. మసాలా, పొగాకు, సిగరెట్, బీడీలకు సంబంధించిన ఉత్పత్తుల విషయంలో రూ. 5794 కోట్ల మేర ఎగవేతలు గుర్తించినట్లు డిజిజిఐ తెలిపింది.

ఏటికేడు ఈ మొత్తం పెరుగుతూనే ఉంది. జిఎస్‌టి అమలులోకి వచ్చిన 2017లో రూ. 7879 కోట్లుగా ఉన్న ఎగవేతల మొత్తం 201819లో రూ. 19319 కోట్లు, 201920లో రూ. 21739 కోట్లు, 202021లో రూ. 31908 కోట్లు, 202122లో రూ. 50325 కోట్లు, 202223లో రూ. 1.01 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News