Monday, June 24, 2024

ధనస్సు రాశివారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే!

- Advertisement -
- Advertisement -

ఆదాయం : 11 వ్యయం : 05
రాజ : 07 అవమానం : 05

మూల 1,2,3,4 పాదములు, పూర్వాషాఢ 1,2,3,4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదముల యందు పుట్టినవారు “యే, యో, బా, బి, భూ, భా, డ, భే” అను అక్షరములు తమ పేరునకు మొదటగలవారు ధనుస్సురాశికి చెందినవారు.

ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. అనుకూలమైన గ్రహ ప్రభావం చేత చాలా విషయాలలో విజయం సాధిస్తారు. జీవిత సాధనకు సంబంధించి గురు గ్రహ అనుగ్రహం చేత మీ మనస్సులో ఉన్న కోరిక నెరవేరుతుంది. గురువు పంచమ, షష్ఠమ స్థాన సంచారం. రా హువు చతుర్ధ స్థాన చలనం, కేతువు దశమ స్థాన చలనం, శని తృతీయ స్థాన చలనం. గురు, శుక్ర మౌఢ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. విద్యా సంబంధ విషయాలు, వాహన కొనుగోలు, నూతన గృహాలకు ప్రయత్నించే వా రికి అనుకూల కాలం.

కుటుంబంలో శుభకార్యాలకు ధనంను విరివిగా హెచ్చిస్తారు. మీరు ధన వ్యయంలో చేసే ప్రణాళికలు రాబోయే భవిష్యత్తు(ప్యూచర్)లో ఉత్తమ ఫలితాలను అందిస్తాయి. పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. మీరు పనిచేసే విద్యా సంస్థలు, కార్యాలయాలలో మోసాలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పులు, ప్రమోష న్లు, బదిలీలు ఉంటాయి. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. గతం లో ఇచ్చిన ఋణాలు తిరిగి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి.
యోగా, మెడిటేషన్, ప్రకృతి వైద్యం, ఆధ్యాత్మిక విద్యను బోధించే వారికి, వైద్య వృత్తులలోని వారికి అనుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తివ్యాపారాలు, దూరప్రాంతాలలో పనిచేసే వారికి అనుకూల కాలం ఉండవచ్చు.

సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారితో సం బంధబాంధవ్యాలు ఏర్పడతాయి. తీర్థయాత్రలు చేసే వారికి, దగ్గర, దూర ప్రయాణాలు చేసే వా రు, మార్పుకోసం చేసే ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన వాతావరణం నెలకుంటుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. లాయర్లకు, టీచర్లకు, లెక్చరర్ల్‌కు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోవడం మంచిది. భాగస్వా మ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సో దర సెదరి వర్గానికి చెందిన వారు అభివృద్ధిలోకి వస్తారు. శత్రు వర్గంపై విజయాన్ని సాధిస్తారు. పాస్‌పోర్టు, వీసాల కోసం ప్రయత్నించేవారికి అవి లభిస్తాయి. గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసే వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైన కొన్ని రకాల ఉత్తర్వులు మీకు మేలు చేస్తాయి. మీ పలుకుబడిని ఉపయోగించి తక్కువ కొటేషన్‌తో ఎక్కువ లాభాలు ఉన్న కాంట్రాక్టులను మీ సొంతం చేసుకుంటారు. వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీని ఎదుర్కొంటారు.

వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసే వ్యాపారులకు, కమీషన్ ఏజెంట్లకు మంచి కా లం. చట్ట వ్యతిరేకంగా నిల్వలు చేస్తే చాలా ఇ బ్బందులు వస్తాయి, జాగ్రత్త. వచ్చిన డబ్బులను వచ్చినట్లుగానే ఖర్చు పెట్టే పద్ధతిని మార్చుకోవాలని అనుకుంటారు, పొదుపు పథకాలలో ధనా న్ని పెట్టుబడిగా పెడతారు.
అవివాహితులకు వివాహ కాలం అని చెప్పవచ్చు. కొంత ఆలస్యం అయినా కూడా మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ సం బంధమైన విషయ వ్యవహారాలు కలిసొస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అతికష్టం మీద సంబంధం కుదురుతుంది. వివాహం చేసుకున్న కొద్ది రోజులకే భేదాభిప్రాయాలతో విడిపోవాలని నిర్ణయించుకున్న దంపతులను చూసి నైరాశ్యం ఏర్పడుతుంది. వాళ్ళను కలిపే ప్రయత్నాలు ఫలించవు. సంతాన పరంగా ఎదురు చూసే వారికి మంచి సమయం. సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఎంతో కాలంగా ఎదురుచూపులకు, మంచి శుభవార్తలను వింటారు. ఏదిఏమైనా సంతాన పరంగా సానుకూల ఫలితాల కోసం సంతాన పాశుపత ెమం చేయించుకోవడం ఉత్తమం. తద్వారా గర్భస్థ శిశువుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఫలితం దక్కుతుంది.

ప్రతి నిత్యం సుబ్రహ్మణ్యస్వామి పూజ, కృత్తికా నక్షత్రం రోజున స్వామి వారికి అభిషేకాదులు నిర్వహించండి. శుభఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం తగిన జాగ్రత్తలు అవసరం. దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్త వహించండి. రక్త హీనతకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
కిడ్నీ సంబందిత ఇబ్బందులకు గురి అయ్యే ప్రమాదం ఉన్నది. రక్తపోటు, మధుమేహం, చెవి, గొంతు తదితర ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఆహార విషయంలో తగు జా గ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఆరోగ్య వ్యా యామ క్రమశిక్షణ అవలంబించండి. స్త్రీ సం బంధిత ఇబ్బందులు అధికంగా ఉంటాయి. సరై న అవగాహన లోపం వలన కొన్ని ఇబ్బందుల ను తెచ్చుకుంటారు. సరైన సమయంలో గుర్తిం చి వైద్యుల సలహాలు, సూచనలు పాటించండి. తలనొప్పి లేదా పార్శపునొప్పి కొంతకాలం బాధిస్తుంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతస్థితి సాధించాలని భావిస్తారు. కొంత మంది మంత్రోప దే శం తీసుకుంటారు. క్రమబద్ధమైన ఆధ్యాత్మిక జీ వితాన్ని గడుపుతారు.

చిన్న విషయాలకు కూడా అతిగా భావిస్తారు. మీ సలహాలను పెడచెవిన పెట్టి దురాశకు పోయి నష్టపోయిన మీ సన్నిహితులను మందలించి తగిన సహాయం కూడాఅం దజేస్తారు. జీవితంలో అశాంతిని సృష్టిస్తున్న ఓ స్త్రీని వదిలించుకోవడానికి న్యాయపోరాటం చేసి విజయం సాధిస్తారు. మనశ్శాంతి కోసం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న చారిటీ ట్రస్ట్‌లు, అనాధ ఆశ్రమాలు, ప్రఖ్యాతి చెందుతాయి. సామాజిక సేవాసంస్థలలోనూ, ఆధ్యాత్మిక కేంద్రాలలోనూ, యూనియన్లలోనూ ఏ పదవీ నిర్వహించకుండా సేవ చేస్తారు. పదవులు లేకుండా సామాన్య రీతిగా ఉంటేనే స్వేచ్చగా ఉంటారని భావిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిర్దిష్ట సమయం కేటాయిస్తారు. భూములు, స్థలాలు, గృహం కొనుగోలు చేస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి మంచి అనుకూల ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News