Tuesday, May 14, 2024

రాష్ట్ర వ్యాప్తంగా మరో 2,043 దేవాలయాలకు కొత్తగా ధూప, దీప, నైవేధ్యం పథకం

- Advertisement -
- Advertisement -
ప్రతినెలా రూ.6 వేల ఆర్థికసాయం

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మరో 2,043 దేవాలయాలకు ధూప, దీప, నైవేధ్యం పథకాన్ని వర్తింప చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 32 జిల్లాల్లోని ఆలయాలకు ఈ పథకం వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. కొత్తగా సిద్దిపేట జిల్లాలో 171, సంగారెడ్డిలో 140, నల్గొండలో 127, నిజామాబాద్‌లో 120 దేవాలయాలకు ఈ పథకం వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఆదాయం లేని ఆలయాలకు ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం ప్రతి నెల రూ.6వేల ఆర్థిక సాయం చేస్తోందని, ఈ పథకాన్ని ఇతర దేవాలయాలకు కూడా వర్తింపచేస్తామని బ్రాహ్మణ సదనం ప్రారంభసమయంలో సిఎం కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కమిషనర్ ఈ జీఓను జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News