Wednesday, March 29, 2023

ఆస్కార్ ప్రతినిధులు డబ్బులు తీసుకొని ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను పొగుడుతున్నారా?

- Advertisement -

హైదరాబాద్: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆస్కార్ బరిలో నిలిపారన్న తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్లపై విమర్శలు వస్తున్నాయి. 80 కోట్లు ఇస్తే ఎనిమిది సినిమాలు తీసి మీ ముఖాన కొడతానని తమ్మారెడ్డి వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. టాలీవుడ్ ప్రముఖలు తమ్మారెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. తమ్మారెడ్డి వివాదస్పద వ్యాఖ్యలపై దర్శకేంద్రుడు కె రాఘఫవేంద్రరావు స్పందించారు. తెలుగు సినిమాకు, తెలుగు సహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకి ప్రపంచ వేదికలపై మొదటి సారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలన్నారు. 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు మీ దగ్గర అకౌంట్స్ సంబంధించిన విషయాలు ఉన్నాయా? అని అడిగారు. జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బులు తీసుకొని ఆర్‌ఆర్‌ఆర్ సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని భరద్వాజ్ ఉద్దేశమా? అని రాఘవేంద్ర రావు అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News