Friday, May 3, 2024

పొంగులేటి సభకు జన సమీకరణపై చర్చ

- Advertisement -
- Advertisement -

బోనకల్ : జులై 2వ తేదీన ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న పొంగులేటి, భట్టి తలపెట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేసేందుకు పొంగులేటి, కాంగ్రెస్ వర్గీయులు స్థానిక పొంగులేటి కాంప్ కార్యాలయాలంలో శుక్రవారం సమావేశమై చర్చించారు. ప్రధానంగా ఖమ్మం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ జన సమీకరణకు నాయకత్వం తీసుకొన్న నిర్ణయానికి అనుగుణంగా మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ స్థాయి నాయకులు కలిసి కట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని తీర్మానించారు.

ఖమ్మంకు సమీపంలో ఉన్న మండలం మండలం కావటంతో జనసమీకరణకు అనుకూలమైన సరిస్తితి ఉందని, దాంతోపాటు మండలంలో గట్టిపట్టున్న కాంగ్రెస్, పొంగులేటి వర్గాలు కలిస్తే మరింత బలంగా తయారయ్యే అవకాశం ఉందని నేతలు అన్నారు. సాధ్యమైనంత వరకు ప్రతి కార్యకర్తను సమావేశానికి తరలించాలని అన్నారు. ప్రభుత్వం బస్సులు ఇవ్వని కారణంగా లారీలు, ఆటోలు, సొంత వాహనాల ద్వారా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి పైడిపల్లి కిషోర్‌కుమార్, మండలకాంగ్రెస్ అద్యక్షుడు గాలి దుర్గారావు, కలకోట సహకార సంఘం చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరావు, బోనకల్, జానకీపురం, రాపల్లి సర్పంచ్‌లు భూక్యా సైదానాయక్, చిలక వెంకటేశ్వర్లు, మందడపు తిరుమలరావు, సీనియర్ నాయకులు తోటకూర వెంకటేశ్వరావు, సండ్ర కిరణ్, చావా లక్ష్మణరావు, ఉమ్మనేని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News