Thursday, May 2, 2024

దిశ ఎన్‌కౌంటర్ బూటకం: పోలీసులే పట్టుకుని కాల్చిచంపారు

- Advertisement -
- Advertisement -

దిశ ఎన్‌కౌంటర్ బూటకం.. పోలీసులే పట్టుకుని కాల్చిచంపారు
సిర్పుర్కర్ కమిషన్ ఎదుట బాధితుల వాంగ్మూలం
మనతెలంగాణ/హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమని మృతుల కుటుంబ సభ్యులు సిర్పుర్కర్ కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. తమ కుమారులు పారిపోలేదని, పోలీసులే పట్టుకెళ్లి కాల్చి చంపారని కమిషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సిర్పుర్కర్ కమిషన్ విచారణలో భాగంగా మృతుల కుటుంబ సభ్యులు శుక్రవారం నాడు కమిషన్ ఎదుట హాజరయ్యారు. బాధితుల వాంగ్మూలాన్ని కమిషన్ నమోదు చేసింది. ఈక్రమంలో శనివారం కూడా కుటుంబ సభ్యుల నుంచి సాక్షాలు సేకరించనున్నారు. 2019 నవంబర్ 27న వైద్యురాలిపై నలుగురు యువకులు తొండుపల్లి టోల్‌గేట్ సమీపంలో హత్యాచారం చేసిన విషయం విదితమే. అనంతరం షాద్‌నగర్ సమీపంలోని జాతీయ రహదారి వంతెన కింద పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న షాద్‌నగర్ పోలీసులు ఆరిఫ్, చెన్నకేశవులు, నవీన్, శివలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో భాగంగా కస్టడీలోకి తీసుకున్న షాద్‌నగర్ పోలీసులు 2019 డిసెంబర్ 6న నిందితులను ఘటనాస్థలికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో ఘటనాస్థలంలో నిందితులు పారిపోయేందుకు పోలీసుల వద్ద నున్న రెండు తుపాకులను లాక్కొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు గాయాలపాలయ్యారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పులలో నలుగురు నిందితులు మృతి చెందారు. సంచలనం సృష్టించిన ఈ ఎన్‌కౌంటర్‌పై మానవ హక్కుల సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు 2019 డిసెంబర్ 12న సర్పూర్కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సర్పూర్కర్ కమిషన్ దిశ ఎన్‌కౌంటర్‌పై ఆరునెలల కాలంలో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించే అకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

Disha Encounter case: Sirpurkar Commission started Inquiry

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News