Saturday, April 27, 2024

ఎసిబి వలలో జిల్లా రవాణా శాఖ అధికారి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లాలో రవాణా శాఖ అధికారి ఎసిబి వలకు చిక్కాడు. పోచంపల్లి మండలం కప్రాయిపల్లి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి నేషనల్ ఫర్మీట్ క్యాన్సిల్ కోసం దరఖాస్తు చేయగా జిల్లా రవాణాశాఖ అధికారి 12 వేలు లంచం డిమాండ్ చేశారు. మరోసారి కలవగా 5000 ఇస్తేనే నేషనల్ పర్మిట్ క్యాన్సిల్ చేస్తానని చెప్పడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ ట్రాప్ లో భాగంగా ఈరోజు ప్రవీణ్ కుమార్ 5000 రూపాయలు తీసుకొని జిల్లా రవాణా కార్యాలయానికి రాగా ఏజెంట్ సురేష్, అనిల్ అనే వ్యక్తులకు ఇవ్వాలని సూచించడంతో వాళ్లకు ఇచ్చాడు.

ఇచ్చిన డబ్బులను ఇద్దరు ఏజెంట్లు అధికారి సురేందర్ రెడ్డి ఇస్తుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కార్యాలయంలోని విచారణ చేసి స్వాధీనం చేసుకున్న నగదు ఇదేనని నిర్ధారించి కేసు నమోదు చేశారు. కార్యాలయంతో పాటు సురేందర్ రెడ్డి నివాసం ఉంటున్న ఆయన ఇల్లు హైదరాబాదులోని అబ్సిగూడలో కూడా దాడులు చేస్తున్నట్లు ఏసిబి నల్గొండ డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాదు ఎసిబి కోర్టుకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న మల్లికార్జున్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News