Tuesday, May 14, 2024

యాభై రోజులు అక్షర యుద్ధం చేయండి

- Advertisement -
- Advertisement -
  • జడ్పీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే అభ్యర్ధి బడే నాగజ్యోతి

ములుగు జిల్లా ప్రతినిధి: యాభై- రోజుల అక్షర యుద్ధం చేయాలని సోషల్ మీడియా కార్యకర్తలకు ములుగు జడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ లో సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు శీలం మధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి బిఆర్‌ఎస్ సోషల్ మీడియా సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న రోజులలో చరవాణి ప్రతి ఒక్కరికి అత్యవసర వస్తువుగా మారిందని అన్నారు.

చరవాణిలోని వివిధ అంశాలై-న ఇంటర్నెట్ ను ఉపయోగించుకుని ఎన్నో అద్భుతాలను సాధించవచ్చని అన్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి వేధికల ద్వారా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని క్షణాలలో కొన్ని లక్షల మందికి చేరవేయవచ్చని అన్నారు. మూడోసారి సీఎం అనే నినాదాన్ని సాకారం చేసుకోవడంలో సోషల్ మీడియా వారియర్స్ పాత్ర ఎంతో ప్రత్యేక మై-నదని అన్నారు. మారుమూల గ్రామంలో ఉన్న తనను సీఎం కేసిఆర్ దృష్టికి వెళ్లేలా చేసింది సోషల్ మీడియానే అని తెలిపారు. ప్రతి కార్యకర్త కేసిఆర్ సైన్యంలో సభ్యుడని, నియోజకవర్గంలో సోషల్ మీడియాలో జరిగే యుద్ధంలో ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొనాలని, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదే అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, ఓడిసిఎం వైస్ చైర్మన శ్రీనివాస్ రెడ్డి, గోవిందరావు పేట ఎంపిపి సూడి శ్రీనివాస్ రెడ్డి, తాడ్వాయి ఎంపిపి గొంది వాణిశ్రీ, గుడివాడ శ్రీహరి, దుర్గం రమణయ్య, మండల పార్టీ అధ్యక్షుడు వేణు, కోయిల మహేష్, సూరయ్య, సాగర్ లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News