Thursday, May 2, 2024

పక్షుల స్వేచ్ఛను హరించొద్దు

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: పక్షులతో వ్యాపారం చేయ డం, పట్టుకుని బంధించి హింసించడం లాంటి చర్యలు చట్టరీత్యా నేరం అవుతోందని పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) జాతీయ కోఆర్డినేటర్ అదర్వ్ దేశ్‌ముఖ్ తెలిపారు. పక్షుల పెంపకం, పక్షులను బంధించడం, హింసించడం వంటి అంశాలపై పెటా ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పక్షులను పంజరంలో బంధిస్తున్న తీరును ఓ మహిళ పంజరంలో ఉండి చేపట్టిన ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. అనంతరం దేశ్‌ముఖ్ మాట్లాడుతూ పక్షులను పంజరంలో బంధించి ఎగిరే స్వేచ్ఛను నిరాకరించడం క్రూరత్వం అవుతోందన్నారు. పక్షులు పంజరానికి చెందినవి కావని, వాటిని స్వేచ్ఛగా ఎగర నివ్వాలని పేర్కొన్నారు. పంజరంలో బంధించడం కారణంగా శక్తివంతంగా ఉండాల్సిన పక్షులు నిరుత్సహానికి గురవుతాయని ఆవేదన వ్యక్తం చేశా రు.

మనుషుల్లాగానే పక్షులు ఎగరడం అనేది సహజత్వం అన్నారు. మానవులకు ప్రకృతి ప్రసాదించిన పక్షులను విక్రయించేందుకు చిన్న పెట్టెల్లో ప్యాక్ చేసి రవాణ చేస్తున్నారని ఆందోళన చెందారు. దేశీయ జాతులకు చెందిన పక్షులను పట్టుకోవడం, వాటితో వ్యాపారం చేయడం, క ంటైనర్‌లో బంధించ డం చట్ట విరుద్దం అ న్నా రు. ప్రజలు ఈ విషయాలను అర్థం చేసుకు ని ప క్షులను పంజరా ల ను ంచి విముక్తి చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News