Saturday, April 27, 2024

యజమానురాలు చనిపోయిందని… శునకం ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Dog commit suicide after owner dead at UP

లక్నో: కిడ్నీ సంబంధిత వ్యాధితో యజమానురాలు చనిపోవడంతో పెంపుడు శునకం నాలుగో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… అనిత రాజ్ సింగ్ అనే వైద్యురాలు మాలిక్‌పురంలోని బర్ర-2 ప్రాంతంలో ఓ ఆస్పత్రిలో హెల్త్ డైరెక్టర్‌గా పని చేస్తోంది. చిన్న కుక్క పిల్లను అనిత పెంచుకుంటుంది. శునకానికి ఇంట్లో వాళ్లు జయ అని ముద్దుగా పేరు పెట్టి పిలిచేవారు. ఈ శునకం కూడా ఇంట్లో కుటుంబ సభ్యురాలిగా ఉండేదని అనిత కుమారుడు తేజాస్ తెలిపాడు. అనిత గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అనిత ఇంట్లో లేకపోవడంతో శునకం ఏది పెట్టిన తినకుండా బలహీనంగా తయారైంది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనిత చనిపోయింది. ఆస్పత్రి నుంచి అనిత మృతదేహాన్ని ఇంటికి తీసుకరాగానే శునకం బోరున విలపించింది. శునకం నాలుగో ఫ్లోర్‌కు వెళ్లి కిందకు దూకింది. వెంటనే అనిత బంధువులు శునకాన్ని దగ్గరలోని వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెన్నెముక విరిగిపోవడంతో శునకం ఆస్పత్రిలో చనిపోయింది. అనిత అంత్యక్రియలు ముగిసిన వెంటనే ఆమె కుటుంబ సభ్యులు శునకం అంత్యక్రియలు ఇంటికి సమీపంలో జరిపించారు. శునకం ఆత్మహత్య చేసుకున్న వార్త దావానంలా వ్యాపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News