Friday, May 3, 2024

అమెజాన్‌లో ల్యాప్‌టాప్ బుక్ చేస్తే పెడిగ్రీ వచ్చింది…

- Advertisement -
- Advertisement -

 

అమెజాన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేస్తే కుక్కలకు తినిపించే పెడిగ్రీని డెలవరీ చేశారు. దీంతో అతడు అమెజాన్ కస్టమర్ కేర్‌కు పోన్ చేస్తే జవాబు ఇవ్వకుండా అతడితో గడుసుగా మాట్లాడారు. అలన్ హుడ్ అనే వ్యక్తి మ్యాక్ బుక్ ప్రో అనే లాప్‌టాప్‌ను అమెజాన్ ఇ కామర్స్ సైట్‌లో ఆన్‌లైన్‌లో బుక్ చేశాడు. ల్యాప్‌టాప్ కు బదులుగా కుక్కలకు వేసే పెడిగ్రీ ఫుడ్‌ను డెలవరీ చేశారు. డెలవరీ చేసిన బాక్స్‌ను ఓపెన్ చేయగా పెడిగ్రీ కనిపించడంతో అలన్ అవాక్కయ్యాడు.

వెంటనే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి తన డబ్బులు వాపస్ ఇవ్వాలని అడిగాడు. కస్టమర్ కేర్ నుంచి అలన్‌కు సరైన సమాధానం రాకపోవడంతో ఎక్స్‌కూటివ్, మేనేజర్‌కు ఫోన్ చేశాడు. అలా 15 గంటల పాటు అమెజాన్ కంపెనీ వాళ్లతో మాట్లాడారు. చివరగా అమెజాన్ కంపెనీ మేనేజర్ ఫోన్ చేసి క్షమాపణ చెప్పాడు. తప్పు తమ కంపెనీ వాళ్లదేనని సారీ చెప్పడంతో పాటు వెంటనే ల్యాప్‌ట్యాప్‌ను పంపించాడు. గతంలో స్మార్ట్ ఫోన్ బుక్ చేస్తే వివిధ రకాలు వస్తువులు డెలవరీ చేసిన విషయం తెలిసిందే. కర్నాటకలో ఓ వ్యక్తి ఈ కామర్స్ వెబ్ సైట్ ల్యాప్‌టాప్ బుక్ చేస్తే రాయితో  పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చిన విషయం విధితమే .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News