Sunday, April 28, 2024

పేదలు ఆత్మగౌరవంగా బ్రతికేందుకు డబుల్ బెడ్ రూమ్ పథకం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ పథకం తీసుకురావడం జరిగిందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మోతె మండల కేంద్రంలో 4కోట్ల 53లక్షల 60వేల రూపాయల వ్యయంతో నిర్మించిన 60 డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా డబల్ బెడ్‌రూమ్ ఇళ్లను అందించాలని లక్షంతో నిర్మించారని ఆయన అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించడానికే డబుల్ బెడ్రూం ఇళ్లని ఆయన తెలిపారు.

అభివృద్ధి, ప్రజా సం క్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లని అన్నారు. గత ప్రభుత్వాలు ఇరుకు గదులు, ఇబ్బందులతో కూడిన నిధులు, అతి తక్కువ వ్యయంతో అరకొర వసతులతో ఇచ్చిన ఇండ్లు కాకుండా,సిఎం కేసీఆర్ తెలంగాణలోని నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వమే సొంతంగా నిర్మించి, లబ్ధిదారులకు అప్పగిస్తున్నదని ఆయన అన్నారు. ఇలాఏ రాష్ట్రంలోనూ జరగడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం నిరుపేదల పక్షపాతిగా పని చేస్తుందని ఆయన తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాలే రెండు కళ్లుగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని అ న్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ దక్కాలనే దే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని అన్నారు.

త్వరలో సొంత స్థల ం ఉన్న పేద ప్రజలకు ఇండ్ల నిర్మాణానికి రూ.3లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇ ండ్ల ఎంపికలో పారదర్శకత పాటిస్తూ ఎంపిక చేశామని ఆయన తెలిపా రు. ఎలాంటి అవినీతికి తావులేకుండా చూస్తామన్నారు. మాకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని లబ్ధిదారులు వ్య క్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ యాదగిరి, ఎంపిడిఓ వెంకటాచారి, మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు, మాజి ఎంపిపి ఆరె లింగారెడ్డి, జిల్లా నాయకు లు ఏలూరు వెంకటేశ్వరరావు,సొసైటీ ఛైర్మన్లు వెంకటరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఆ యా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News