Friday, May 3, 2024

పేదరిక నిర్మూలనలో డబుల్ ఇంజిన్ వెలవెల

- Advertisement -
- Advertisement -
సంపద పెంచు.. ప్రజలకు పంచు నినాదంతో సిఎం కెసిఆర్ ముందుకు : కోలేటి దామోదర్

హైదరాబాద్ :  పేదరిక నిర్మూలనలో తెలంగాణగుజరాత్ మధ్య నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నట్లు నీతి అయోగ్ నివేదిక తేటతెల్లం చేసిందని తెలంగాణ రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్ధ చైర్మన్ కోలేటి దామోదర్ ఎద్దేవా చేశారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ దేశంలోనే చిన్న రాష్ట్రమైనా తెలంగాణ ముందు గుజరాత్ అన్నింటి నానాటికి తీసికట్టు అవుతున్నదని ఆ నివేదిక నిగ్గు తేల్చిందని తెలిపారు. సంపద పెంచు ప్రజలకు పంచు అనే నినాదంతో సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల ఫలాలు సామాన్యులకు అందడంతో తెలంగాణలో పేదరికం తగ్గిందన్నారు. పేదరిక నిర్మూలనలో రాష్ట్రం గణనీయమైన ముందడగు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జాతీయ సగటు కన్నా తెలంగాణ పేదరికం తగ్గింపులో అద్వితీయమైన ప్రగతి సాధించడం కెసిఆర్ తపన, కృషితో సాధ్యమైందని కొనియాడారు. జాతీయ సగటు పేదరికంతో పోలిస్తే తెలంగాణ పేదరికం అందులో మూడవ వంతు మాత్రమే ఉండటం బిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన కీర్తీగా అభివర్ణించారు.

కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో బిఆర్‌ఎస్ సర్కార్ కొలువుదీరినప్పటికి నుంచి ఒక్కో రంగంపై తదేక దీక్షతో కృషి చేయడం తెలంగాణ కీర్తి విశ్వమంతా వ్యాపించిందన్నారు. నిధులు, పరిశ్రమలు ఎగురేసుకపోయి గుజరాత్‌లో గుమ్మరిస్తున్న పేదరిక నిర్మూలనలో మాత్రం ఆరాష్ట్రం పరిస్థితి దయనీయంగా ఉందని విమర్శించారు. గుజరాత్ మోడల్ అంటూ ఊకదంపుడు ప్రచారం గుట్టును నీతి అయోగ్ నివేదిక రద్దు చేసినందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

డబుల్ ఇంజన్ గుజరాత్ సింగిల్ ఇంజన్ తెలంగాణ ముందు వెలవెలపోతున్నదని విమర్శించారు. నిధులు కేటాయింపు నుంచి అన్నింటా వివక్షత చూపినప్పటికి తెలంగాణ ప్రగతికి కేంద్రం అడ్డుకట్ట వేయలేకపోయిందనడానికి నీతి అయోగ్ నివేదికే నిదర్శమన్నారు. సిఎం కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పట్టణాల్లో మెరుగులు, పల్లెలో మురుగులు అనే దశ పోయి సమాంతర పరుగులు మొదలయ్యాయినడానికి సాక్షం తగ్గుతున్న పేదరికం గణాంకాలేనని పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిన ప్రభావాల ఫలితంగా పేదరికం అడుగంటుతున్నందని అభిప్రాయ వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణ మోడల్ దేశ వ్యాప్తంగా కావాలనే డిమాండ్ అంతకంతకూ బలంగా వినిపిస్తోందన్నారు. దేశ ప్రజల చిరకాల కోరిక సిఎం కెసిఆర్ సారధ్యంలోనే నెరవేరుతుందన్న ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News