Tuesday, May 21, 2024

భారత్‌లో రష్యా టీకా ట్రయల్స్‌కు డాక్టర్ రెడ్డీస్ దరఖాస్తు

- Advertisement -
- Advertisement -

Dr. Reddys application for Russian vaccine trials in India

 

న్యూఢిల్లీ : హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ భారత్‌లో రష్యా కరోనా టీకా స్పూత్నిక్ వి మూడోదశ ట్రయల్స్ చేపట్టడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ)కి దరఖాస్తు చేసుకుంది. ట్రయల్స్ చేపట్టడానికి అలాగే టీకా సరఫరా చేయడానికి ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ రష్యాడైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్)తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. భారత్‌లో ట్రయల్స్‌కు అనుమతి లభించాక డాక్టర్ రెడ్డీస్‌కు ఆర్‌డిఐఎఫ్ వంద మిలియన్ డోస్‌ల వ్యాక్సిన్‌ను సరఫరా చేయనున్నట్టు గత నెల ఆసంస్థ వెల్లడించింది. భారత్‌లో ట్రయల్స్ అనేక కేంద్రాల్లో, ఎలాంటి పరిశీలనా పద్ధతులు లేకుండా, యాధృచ్ఛిక నియంత్రణ అనుసరించి నిర్వహిస్తారు. సెప్టెంబర్ 1 నుంచి రష్యాలో 40,000 వాలంటీర్లపై మూడోదశ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News