Tuesday, June 18, 2024

విజయవాడ మోడీ రోడ్ షోలో అనుమానిత డ్రోన్లు

- Advertisement -
- Advertisement -

ఎపిలోని విజయవాడలో ప్రధాని మోడీ రోడ్‌షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్ అయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8న విజయవాడలో ప్రధాని మోడీ ఎన్డీయే భాగస్వాములు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లతో కలిసి రోడ్‌షో నిర్వ్రహించారు. నరేంద్ర మోదీ ర్యాలీకి 45 నిమిషాల ముందు, ర్యాలీ ప్రారంభం, చివరలో డ్రోన్‌లు ఎగురవేయడంపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. ప్రధాని రోడ్‌షో ప్రాంతం ముందుగానే నోప్లై జోన్‌గా ప్రకటించినా డ్రోన్లు ఎలా ఎగరగలిగాయాని కేంద్ర హోంశాఖ డిజిపిని ప్రశ్నించింది. ఈ ఘటన వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిజిపికి కేంద్ర హోం శాఖ లేఖ పంపించింది. ఇప్పటి వరకూ ఇలా ప్రధాని రోడ్ షోలో అనధికారిక డ్రోన్లు ఎగిరిన విషయం బయటకు రాలేదు. ప్రధాని మోడీ భద్రతా ఏర్పాట్లను ఎస్‌పిజి చూసుకుంటుంది. ఏ మాత్రం చిన్న తేడా కనిపించినా సీరియస్‌గా స్పందిస్తుంది.

ప్రధాని రోడ్ షో రోజున మొదట ఓ డ్రోన్ ఎగరడం గమనించి కిందకి దించి వేయించారు. ఈ ఘటన తర్వాత మరో డ్రోన్ ఎగరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే రోడ్ షో ముగిసే సమయంలో మరో డ్రోన్ ఎగిరింది. దీనిపై ఎస్‌పిజి గ్రూప్ అప్పుడే కేంద్ర హోంశాఖకు నివేదిక పంపింది. తీవ్ర భద్రతా ఉల్లంఘనగా భావించింది. బందోబస్తు నిర్వహించిన పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా ఉండటమో, లేకపోతే వారి అనుమతితో ఎగురవేయడమో చేసి ఉంటారని భావిస్తున్నారు. కేంద్ర హోంశాఖ స్వయంగా ఆదేశించడంతో ఇప్పుడు డిజిపి అసలు డ్రోన్లు ఎగురవేసిన వాళ్లు ఎవరు? ఎందుకు ఎగురవేశారు? పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు? ఒక వేళ పోలీసులే ఎగురవేస్తే? నిబంధనలు ఎందుకు పట్టించుకోలేదు వంటి అంశాలపై దర్యాప్తు చేసి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మోడీ భద్రతా ఏర్పాట్లను సీనియర్ ఐపిఎస్ అధికారులు చూస్తారు.

వారిలో నిర్లక్ష్యం ఎవరితో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం ఇదే మొదటి సారి కాదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే మోడీ చిలుకలూరిపేట బహిరంగసభకు హాజరయ్యారు. ఆ సభలో మొత్తం గందరగోళం ఏర్పడింది. పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా ఆ సభ రక్షణ బాధ్యతల్లో ఉన్న పలువురు ఎస్‌పిలపై ఇసి వేటు వేసింది. ఈ సారి మరికొంత మంది ఐపిఎస్ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News